చలికాలంలో కరోనాతో జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు

  • Published By: naveen ,Published On : November 6, 2020 / 02:33 PM IST
చలికాలంలో కరోనాతో జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు

becareful with coronavirus in winter: మన దేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందా.. రాగల 3 నెలలూ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందా.. ఆరు నెలల క్రితం ఎలాగైతే దుకాణాల దగ్గర సర్కిల్స్ గీసుకుని మరీ సోషల్ డిస్టెన్స్ పాటించారో.. ఆ పరిస్థితులే తిరిగి తలెత్తుతుయా.. అంటే.. ఔననే అంటున్నారు. ఇప్పుడు కాస్త తగ్గిన కరోనా కేసులు వచ్చే మూడు నెలలూ భారీగా పెరుగుతాయని.. అప్రమత్తంగా లేకపోతే లక్షలకి లక్షల కేసులు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు.

చలికాలంలో వైరస్ బారిన పడుకుండా వ్యవహరించడం చాలా ముఖ్యం:
సెకండ్ వేవా..థర్డ్ వేవా అన్న సంగతి పక్కన బెడితే.. చాలా చోట్ల వైరస్‌పై భయం పోయింది. భయం పోయింది కదాని ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఎలా.. అందులో మనకిప్పుడు ఈ మూడు నెలలూ చాలా కీలకం. వేసవి కాలం, వర్షాకాలం ఎలాగోలా మహమ్మారి బారి నుంచి తప్పించుకోగలిగాం. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే మరణాల శాతం మనకి చాలా తక్కువ. అంతేకాదు.. రికవరీ రేటు కూడా 92శాతానికి చేరింది. ఇలాంటి స్థితిలో ఈ చలికాలంలో వైరస్ బారిన పడుకుండా వ్యవహరించడం చాలా ముఖ్యం. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు.
https://10tv.in/winter-flu-jab-could-protect-against-coronavirus-as-experts-hail-new-weapon-against-bug/
ఇండియాలో చలికాలంలో కరోనా కేసులు అత్యధికానికి చేరే చాన్స్:
ఢిల్లీలో థర్డ్ వేవ్ మొదలైంది.. మరి మిగిలిన చోట్ల వైరస్ కేసులు తగ్గిపోయినట్లేనా.. రికవరీ భారీగా నమోదు కావడంతో.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఐదు లక్షల పైచిలుకుకు చేరింది. మరి అంతా బావున్నట్లేనా..?
అస్సలు కానే కాదు. ఇతర దేశాల్లో ఎలాగైతే.. కరోనా మహమ్మారి రెండో విడత విజృంభించడం ప్రారంభమైందో మన దేశంలోనూ చలికాలంలో వైరస్ కేసులు అత్యధికానికి చేరుతుందంటున్నారు.. ఇందుకు సంబంధించిన హెచ్చరికలు కూడా వివిధ రాష్ట్రాలు స్థానికంగా ఇస్తున్నాయ్.. ఎందుకంటే టెస్ట్ చేస్తే బయటపడుతున్న వైరస్ కేసులే ఇలా ఉంటే.. ఇక ఎసింప్టమేటిక్ గా(ఏ లక్షణాలు లేకుండా) పూర్తి నిద్రాణంగా సైలెంట్‌గా కమ్మేస్తోన్న వైరస్ బాధితుల మాటేంటి..ఇదే ఆందోళన కలిగించే అంశం.

వీలైనంత తొందరగా వారిని గుర్తిస్తే సెకండ్ వేవ్ కేసులను తగ్గించవచ్చు:
రానున్న ప్రమాదాన్ని ఊహించే తెలంగాణాలోనూ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.. ప్రతి జిల్లాలో మొబైల్ టెస్టింగ్ యూనిట్లు ప్రారంభించింది. జనాలు రద్దీగా ఉండే ఏరియాల్లో ఈ టెస్టింగ్ యూనిట్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తాయ్..వైరస్ వ్యాప్తిలో సూపర్ స్ప్రెడర్ల పాత్రే ప్రధానం.. అందుకే వీలైనంత తొందరగా వారిని గుర్తిస్తే సెకండ్ వేవ్ కేసులను తగ్గించవచ్చు.

దీపావళి పండగ జరుపుకునే విధానంపై ప్రభుత్వం ఆంక్షలు:
ఓవైపు భారీగా ఢిల్లీలో వైరస్ కేసులు పెరిగిపోతున్నా..జనం ఆంక్షలన్నీ గాలికి వదిలేసారు. వైరస్ తమకి వచ్చే ఛాన్సే లేదనుకున్నారో ఏమో కానీ.. భౌతికదూరాన్ని పాటించడం మానేశారు.. ఇది దృష్టిలో పెట్టుకునే
ఢిల్లీ ప్రభుత్వం దీపావళి పండగ జరుపుకునే విధానంపై ఆంక్షలు విధించింది. ప్రతి నెలా ఐసిఎంఆర్ ఆధ్వర్యంలో జరిగే సీరో సర్వెవలెన్స్ సర్వేలో షాక్ కొట్టే నంబర్లు బైటపడుతున్నాయ్.. ఏకంగా కొన్ని రాష్ట్రాల్లో కోట్లమందికి వైరస్ సోకిందని తేలడం కరోనా వ్యాప్తి ఎంత వేగంగా.. ఎంత నిశ్సబ్దంగా ఉందో తెలియజేస్తోంది.

కర్నాటకలో కోటి 93లక్షలమందిలో యాంటీబాడీలు:
కర్నాటక విషయమే చూసుకుంటే ఇక్కడ ఏకంగా కోటి 93లక్షలమందిలో యాంటీబాడీలు ఉండొచ్చనే అంచనాలు వెలువరించింది. కర్నాటక జనాభా 7కోట్ల 7లక్షలు..ఈ జనాభాలో ఇంతమందికి కరోనా సోకిందంటే..వైరస్ లక్షణాలతో కంటే ఏ రోగలక్షణం లేకుండా సాఫీగా కన్పిస్తున్నవారే ఎక్కువమందని అర్ధమవుతోంది. కర్నాటకలోని 30 జిల్లాల్లో ఈ ర్యాండమ్ సర్వే జరిగింది. కర్నాటకలో ఈ సీరో సర్వే చేసిన శాంపిల్ సైజ్ 16వేల 585.. అంటే 16వేల 585మందికి ఆర్టీపిసిఆర్ టెస్టులు చేయగా దాదాపు 700మందికి కరోనా యాంటీబాడీలు కన్పించాయ్. తీసుకున్న నమూనాలు తక్కువగా ఉన్నా..కర్నాటక రాష్ట్ర జనాభా అంతా టెస్టులు చేస్తే..ఇవే రకమైన ఫలితాలు వచ్చే అవకాశాలే ఎక్కువంటారు.

కేరళలో రోజుకి 10 నుంచి 11వేల పాజిటివ్ కేసులు:
కేరళ రాష్ట్రంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది.. అక్టోబర్ నెలలో రోజుకి పదివేలు.. పదకొండు వేలు ఇక్కడ వైరస్ కేసులు నమోదయ్యాయ్. కంటైన్‌మెంట్ జోన్లు పెంచి కఠిన నిబంధనలు అమలు చేయడంతో.. ఇప్పుడు వాటి సంఖ్య ఆరు వేల నుంచి 8వేలకు పరిమితం అయ్యాయ్..ఐతే ఇది పూర్తిగా తగ్గిపోయినట్లు భావించడానికి లేదు. శబరిమల దర్శనాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణ కేరళ ప్రభుత్వానికి ఓ సవాలే. అలానే హెల్త్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించినంత కాలం ఇక్కడ వైరస్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయ్.. అంటే వైరస్‌ని నియంత్రించాలంటే మనల్ని మనం నియంత్రించుకుంటేనే సాధ్యమవుతుందన్నది కేరళ, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల అనుభవాలను బట్టి అర్ధం చేసుకోవాలి.

మాస్క్, భౌతికదూరం మస్ట్.. లేదంటే అమెరికా లాంటి భయంకర పరిస్థితులు:
అసలంటూ ఒకరికి వైరస్ ఉందనే సంగతి తెలిసి ఉంటే.. ఏదైనా జాగ్రత్త తీసుకోవచ్చు..కానీ అసలు ఎవరిలో వైరస్ ఉందో.. లేదో తెలీనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అందుకే అందరూ మాస్క్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించినప్పుడే ఈ ఎసింప్టమేటిక్ కేసులు కూడా తగ్గిపోతాయ్. లేదంటే యూరప్, ఇటలీ, అమెరికాలో మొదటి దశలో ఎంత భయంకర పరిస్థితులు తలెత్తాయో.. అలాంటి సిచ్యుయేషన్ మనకి వాటిల్లే ప్రమాదముంది.