మందుబాబులకు గుడ్ న్యూస్, బీర్ వెరీ చీప్

కరోనా కాలంలో లిక్కర్ పై అధిక ప్రభావం పడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తో మద్యం షాపులు తెరుచుకోలేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది.

మందుబాబులకు గుడ్ న్యూస్, బీర్ వెరీ చీప్

Beer To Get Cheaper In Rajasthan From April 1

Beer to get cheaper in Rajasthan from April 1 : ఎండకాలంలో చిల్ చిల్ గా బీర్ తాగాలని అనుకునే వారికి గుడ్ న్యూసే. ఒక్క బాటిల్ ధర రూ. 100 నుంచి 150 ఉంటుండడంతో ఏమి తాగుతాం అనుకొనే వారు కొందరు. కొందరైతే ఆ ఏముందిలే..అంటూ డబ్బులు ఇచ్చేసి కొనుగోలు చేస్తుంటారు. బీర్ ధర తగ్గిస్తే బాగుటుండే…అనుకొనే వారు ఉంటారు. ఒక్క బీర్ పై ఏకంగా రూ. 30 నుంచి రూ. 35 తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం. అయితే..మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు లెండి. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది.

కరోనా కాలంలో లిక్కర్ పై అధిక ప్రభావం పడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తో మద్యం షాపులు తెరుచుకోలేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. 2019-20 ఏడాదిలో 2 కోట్ల 65 లక్షల బీర్ల కేసులు అమ్ముడు పోయాయి. 2020 -21 సంవత్సరంలో ఆ సంఖ్య ఒక కోటి 60 లక్షలకు తగ్గింది. కేవలం 95 లక్షల బీర్ల కేసులు మాత్రమే అమ్ముడు పోయాయి. బీర్ల రేట్లపై అదనపు ఎక్సైజ్ సుంకం, కొవిడ్ సర్ ఛార్జీ పెంచడంతో బీర్ల అమ్మకాలపై ఎఫెక్ట్ పడింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది.

బీర్లు తాగేందుకు మందుబాబులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ప్రభుత్వం గ్రహించింది. బీర్ తక్కువ రేటుకే లభించేలా చర్యలు తీసుకోవాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఖజానాకు భారీగా రెవెన్యూ తగ్గడంతో బీర్ల అమ్మకాల విషయంలో ఎక్సైజ్ పాలసీలో స్వల్ప మార్పులు తీసుకొచ్చింది. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం..బీర్ల ధరలు రూ. 30 నుంచి రూ. 35 వరకు తగ్గనున్నాయి. బీర్ బ్రాండ్ ను బట్టి ధరలు మారనున్నాయి. బీర్ల అమ్మకాలను పెంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా కొత్త ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేశారు. దీని ప్రకారం…వాటి ఎమ్మార్పీ ధరలపై అదనపు ఎక్సైజ్ సుంకం, కొవిడ్ సర్ ఛార్జీని తగ్గించారు.