BEL Recruitment 2021: బీటెక్ ఉంటే చాలు.. ఇంటర్వ్యూ లేకుండానే రూ.35వేలు జీతం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) ఆర్గనైజేషన్ నుంచి మరో జాబ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 268 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల...

BEL Recruitment 2021: బీటెక్ ఉంటే చాలు.. ఇంటర్వ్యూ లేకుండానే రూ.35వేలు జీతం

Bel Recruitment 2021

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) ఆర్గనైజేషన్ నుంచి మరో జాబ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 268 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. పంజాబ్, ఢిల్లీ, జమ్మూ అండ్ కశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, అస్సాం, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఈ నియామకాల ద్వారా ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని నాలుగేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 35 వేల వరకు వేతనం చెల్లిస్తారు. రెండో ఏడాది నెలకు రూ.40 వేలు చొప్పున, మూడో ఏడాది నెలకు రూ.45 వేల చొప్పున వేతనం చెల్లించనున్నారు. నాలుగో ఏడాది నెలకు రూ. 50 వేల చొప్పున వేతనం ఉంటుంది.

కీలక అంశాలు:
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైన వారే అర్హులు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, టెలీ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ తదితర విభాగాల్లో బీఈ/బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
వయసు: అభ్యర్థుల వయస్సు 32 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐదేళ్ల పాటు.. ఓబీసీ విద్యార్థులకు మూడేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 21, 2021
దరఖాస్తుకు చివరితేది: మే 5, 2021
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)
వెబ్‌సైట్‌: https://bel-india.in/