Donkey Milk : గాడిద పాలు లీటరు రూ.10వేలు..వీటి ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు వదలరు

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము (గాడిద) పాలు అని చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం. కానీ ఇప్పుడు గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంది. ఎంత డిమాండ్ అంటే గాడిద పాలు లీటరు రూ.10వేలు అమ్ముతున్నారు. గాడిద పాలకు ఇంత డిమాండా? వీటిని దేనికి ఉపయోగిస్తారు? గాడిద పాలల్లో ఉండే ఆ ఉపయోగాలేంటో తెలుసుకుందాం..

Donkey Milk : గాడిద పాలు లీటరు రూ.10వేలు..వీటి ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు వదలరు

Donkey Milk

Benefits of donkey milk : గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము (గాడిద) పాలు అని చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం. కానీ ఇప్పుడు గాడిద పాలకు చాలా చాలా డిమాండ్ ఉంది. ఎంత డిమాండ్ అంటే గాడిద పాలు లీటరు రూ.10వేలు..!. మరి తెలిసిందా ఎంత డిమాండో..!! ఏంటీ గాడిద పాలకు అంత ధరా..ఎక్కడా అంటారా. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ లోని ఉమర్గాకు చెందిన ధోత్రే కుటుంబం 20 గాడిలను పెంచుతు లీటరు గాడి పాలు రూ.10వేలు అమ్ముతున్నారు. గాడిద పాలకు ఇంత డిమాండ్ ఏంటీ? ఎందుకు ఇంత ధర?వీటిని దేనికి ఉపయోగిస్తారు? అనే డౌట్స్ వచ్చే ఉంటాయిగా..మరి ఉపయోగాలు లేకపోతే అంత ధర ఎలా ఉంటుంది? మరి ఆ ఉపయోగాలేంటో..గాడిద పాలల్లో ఉండే ఆ మహత్తు ఏంటో తెలుసుకుందాం..

గాడిద పాలలో ఆరోగ్యానికి ఉపకరించే ఎన్నో విశేష గుణాలున్నాయని అంటున్నారు సైంటిస్టులు. జన్యుపరమైన, వైరల్ సంబంధిత సమస్యలకు గాడిద పాలు చక్కని పరిష్కారాన్ని సూచిస్తాయని తెలిపారు. అంతేకాదు గాడిద పాలతో ఔషధాలే కాకుండా బ్యూటీ ఉత్పత్తులను కూడా రూపొందిస్తున్నారు.

కేరళ, మహారాష్ట్రలలో గాడిద పాలలో ఉండే ఔషధ గుణాల గురించి..ఆ పాల వల్ల ఉపయోగాల గురించి నిర్వహించిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇవ్వటంతో గాడిద పాలకు డిమాండ్ వచ్చి పడింది. గాడిద పాలను తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. దగ్గు, జలుబు, ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్, టీబీ తదితర వ్యాధుల నివారణలో గాడిదపాలు ఉపకరిస్తాయని పరిశోధనల్లో తేలింది.

కేరళలోని కోచికి చెందిన ఏబీ బేబీ… గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు రూపొందించి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. అలా సంవత్సరానికి రూ. 20 లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. పలు పరిశోధనలు నిర్వహించిన తరువాతనే వీరు సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. గాడిద పాలతో తయారు చేసే సౌందర్య ఉత్పత్తులు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అంతే కాదు వీటికి చాలా ఖరీదుకూడా ఎక్కువే… గాడిద పాలను సబ్బులు, లిప్ బా‌మ్‌లు, బాడీ లోషన్లు తదితర వాటిని తయారు చేసేందుకు వినియోగిస్తున్నారు.

అలాగే మహారాష్ట్రలోని షోలాపూర్‌లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు గాడిద పాలతో బ్యూటీ ప్రొడక్ట్స్ రూపొందిస్తున్నారు. చిన్నపిల్లలకు గాడిద పాలు చాలా బలాన్నిస్తాయట. కాగా ఒక్కో గాడిద రోజుకు 200 నుంచి 250 మిల్లీలీటర్ల పాలు ఇస్తుంది. మరి ఇన్ని ఉపయోగాలున్న గాడిద పాలకు డిమాండ్ ఉండకేం చేస్తుంది చెప్పండి..

గాడిద గురించి సరదాగా..
ఎవరన్నా పిచ్చి పనులు చేస్తే ఏంటీ గాడిదలా ఉన్నావ్..ఆమాత్రం తెలిదు అలా చేయకూడదని అని తిడతారు. గాడిదను తిట్టటానికే కాదండోయ్..ఎక్కువ బరువులు మోసేవారికి గాడిదలాగా ఎంత బరువు మోస్తున్నాడో అంటారు.అలాగే ఎక్కువ పనులు చేస్తే గాడిద చాకిరి అని కూడా అంటారు. కానీ ఇప్పుడు గాడిద అనేది అంత తేలిగ్గా తీసి పారేసే జంతువు మాత్రం కాదు. కాస్ట్లీ అనే చెప్పాలి. మరి లీటరు పాలు రూ.10వేలు అమ్మే జంతువు కాస్ట్లీ కాకపోతుందా ఏంటీ..హా ఇక్కడో విషయం పాలు ఇచ్చే గాడిద అంటే ఆడ గాడిద అనే విషయం గమనించాలి.

కాగా..గుజరాత్‌లో కనిపించే హలారి జాతి గడిద పాలలో ఔషధాల నిధిగా గుర్తించారు. హలారి గాడిద పాలకు క్యాన్సర్‌, ఊబకాయం, అలర్జీ మొదలైన వ్యాధులపై పోరాడే సామర్థ్యం ఉందంటున్నారు నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెన్స్. గాడిద పాలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీఏజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని..గాడిద పాలపై పరిశోధన కార్యక్రమం సందర్భంగా ఎన్ఆర్‌సీఈ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎన్ ఆర్ త్రిపాఠి తెలిపారు.