బెంగాల్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా

ప‌శ్చిమ బెంగాల్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం రాజీనామా చేశారు.

బెంగాల్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా

Bengal Bjp Mps

2 Bengal BJP MPs resign as MLAs ప‌శ్చిమ బెంగాల్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన జగన్నాథ్ సర్కార్,నిసిత్ ప్రమాణిక్ త‌మ‌ రాజీనామా లేఖ‌ను అసెంబ్లీ స్పీకర్ బిమాన్ బెనర్జీకి అంద‌జేశారు. దీంతో బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ మెజార్టీ 75 కి పడిపోయింది.

కాగా, ఇప్పటికే ఎంపీలుగా ఉన్న జగన్నాథ్ సర్కార్,నిసిత్ ప్రమాణిక్ ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. రానాఘాట్ ఎంపీగా ఉన్న జగన్నాథ్ సర్కార్..శాంతిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన 16వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందగా,కూచ్ బెహర్ ఎంపీగా ఉన్న నిసిత్ ప్రమాణిక్.. దిన్హాటా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి కేవలం 57 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే రాష్ట్రంలో అధికారం సాధించ‌క‌పోవ‌డంతో పార్లమెంటులో వీరిద్దరి సభ్యత్వాన్ని నిలుపుకోవాలని బీజేపీ నిర్ణయించింది.

పార్టీ నాయకత్వం సూచన మేరకు తాము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగన్నాథ్ సర్కార్,నిసిత్ ప్రమాణిక్ తెలిపారు. వీరి రాజీనామాతో శాంతిపూర్, దిన్హాటా స్థానాలకు మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. రూల్స్ ప్రకారం ఉప ఎన్నిక ఆరు నెలల్లోపు జరగాలి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ..నలుగురు ఎంపీలకు టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు ఎంపీలు లాకెట్ ఛటర్జీ, బాబుల్ సుప్రియో ఓడిపోగా.. వారు ఎంపీలుగా కొనసాగుతారు. గెలిచిన ఎంపీలు ఇద్ద‌రు కూడా ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డంతో వీరు కూడా ఎంపీలుగా కొనసాగనున్నారు