Nandigram Mamata : నందిగ్రామ్‌లో వెనుకంజలో దీదీ, మేజిక్ ఫిగర్ దాటిన టీఎంసీ

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే స‌మయానికి సువేందు అధికారి 8వేల 106 ఓట్ల ఆధిక్యంలో ఉండ‌టం గ‌మనార్హం. నందిగ్రామ్ లో

Nandigram Mamata : నందిగ్రామ్‌లో వెనుకంజలో దీదీ, మేజిక్ ఫిగర్ దాటిన టీఎంసీ

Nandigram Mamata

Nandigram Mamata : ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే స‌మయానికి సువేందు అధికారి 8వేల 106 ఓట్ల ఆధిక్యంలో ఉండ‌టం గ‌మనార్హం. నందిగ్రామ్ లో మమత వెనుకంజలో ఉండటం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు సాధించే దిశ‌గా వెళ్తోంది. అధికార టీఎంసీకి గ‌ట్టి పోటీ ఇస్తోంది.

కాగా, ఓవరాల్ గా చూసుకుంటే టీఎంసీ లీడ్ లో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ ను టీఎంసీ దాటేసింది. ప్రస్తుతం 148 స్థానాల్లో టీఎంసీ, 116 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి.

అందరి చూపు బెంగాల్ వైపు:
ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మిగతావాటి కంటే.. దేశం యావత్తు బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే బీజేపీ, టీఎంసీలు హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ అగ్రనాయకత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఇక్కడ ప్రచారం నిర్వహించింది. అటు, మమతా కూడా సర్వశక్తులూ ఒడ్డి ఒంటరి పోరాటం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ మరోసారి విజయం సాధిస్తారా, మోడీ-అమిత్‌షాల నేతృత్వంలో విస్తృతంగా సాగిన ప్రచారం ఫలిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. మమత తన రాజకీయ జీవితంలో ఇంతటి సవాల్‌ను ఎన్నడూ ఎదుర్కోలేదు.