Dialling Childline: చైల్డ్ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తన పెళ్లి రద్దయ్యేలా చేసిన బాలిక 

మారుమూల గ్రామంలో జన్మించినప్పటికీ చదువుకుని నర్సు కావాలని, ఆ తర్వాతే పెళ్ళి గురించి ఆలోచించాలని ఓ బాలిక (15) కలలు కంటోంది. అయితే, 15 ఏళ్ల వయసులోనే ఆమె పెళ్లి నిశ్చయించారు తల్లిదండ్రులు. దీంతో చైల్డ్ హెల్ప్ లైన్ నంబరు 1098కు ఫోన్ చేసి, తనకు ఇష్టం లేకుండానే పెళ్లి చేస్తున్నారని చెప్పింది. వెంటనే ఆమె ఇంటికి వెళ్లిన అధికారులు, పోలీసులు ఆ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లిని రద్దు చేయించారు.

Dialling Childline: చైల్డ్ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తన పెళ్లి రద్దయ్యేలా చేసిన బాలిక 

Dialling Childline: మారుమూల గ్రామంలో జన్మించినప్పటికీ చదువుకుని నర్సు కావాలని, ఆ తర్వాతే పెళ్ళి గురించి ఆలోచించాలని ఓ బాలిక (15) కలలు కంటోంది. అయితే, 15 ఏళ్ల వయసులోనే ఆమె పెళ్లి నిశ్చయించారు తల్లిదండ్రులు. దీంతో చైల్డ్ హెల్ప్ లైన్ నంబరు 1098కు ఫోన్ చేసి, తనకు ఇష్టం లేకుండానే పెళ్లి చేస్తున్నారని చెప్పింది. వెంటనే ఆమె ఇంటికి వెళ్లిన అధికారులు, పోలీసులు ఆ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లిని రద్దు చేయించారు.

ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జిల్లా, కాశీపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ బాలిక ‘కన్యాశ్రీ’ క్లబ్ సభ్యురాలు కావడంతో బాల్య వివాహాలు చేసుకుంటే జరిగే అనర్థాలపై పూర్తి అవగాహన కలిగి ఉంది. ‘కన్యాశ్రీ’ క్లబ్ సామాజిక దురాచారాలపై అవగాహన కల్పిస్తుంటుంది. ఆ క్లబ్ లో సభ్యురాలిని కావడంతో తరుచూ అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లేదానినని, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి ఆశ, యునిసెఫ్ శిక్షణా సిబ్బంది చెబుతుంటే విని అవగాహన పెంచుకున్నానని చెప్పింది. 18 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న విషయాన్ని తెలుసుకున్నానని ఆ బాలిక తెలిపింది.

తాను కూడా బాల్య వివాహ బాధితురాలిగా మారబోతున్నట్లు తెలుసుకున్న వెంటనే 1098కి ఫోను చేసి అధికారులకు సమాచారం అందించానని పేర్కొంది. తన పేరు, అడ్రస్సు ఇతర వివరాలు ఫోనులో తెలుసుకుని అధికారులు వచ్చారని తెలిపింది. తాను చేసిన పనికి మొదట తన తల్లిదండ్రులు బాధపడ్డారని, వారికి అధికారులు బాల్య వివాహాల వల్ల జరిగే అనార్థల గురించి చెప్పాక వెనక్కి తగ్గారని చెప్పింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..