Bengal Governor CV Ananda Bose : జనవరి 26న బెంగాల్ గవర్నర్‌కు ‘అక్షరాభ్యాసం’.. హాజరుకానున్న సీఎం మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌కు జనవరి (2023) 26న రాజ్ భవన్ లో అక్షరాభ్యాసం జరగనుంది. ఈకార్యక్రమం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే జరగనుంది.

Bengal Governor CV Ananda Bose : జనవరి 26న బెంగాల్ గవర్నర్‌కు ‘అక్షరాభ్యాసం’.. హాజరుకానున్న సీఎం మమతా బెనర్జీ

Bengal Governor CV Ananda Bose to learn Bengali In RajBhavan

Bengal Governor CV Ananda Bose :  పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌కు జనవరి (2023) 26న రాజ్ భవన్ లోనే అక్షరాభ్యాసం జరగనుంది. అదేంటీ గవర్నర్ కు అక్షరాభ్యసమా? అని ఆశ్చర్యపోతాం కదా? జోక్ కారు ఇది నిజ్జంగా నిజం.పైగా ఈకార్యక్రమం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే జరగనుంది. గవర్నర్ కు జరగనున్న అక్షరాభ్యం కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ స్వయంగా హాజరుకానున్నారు. ఇదంతా గందరగోళంగా ఉంది కదూ..అసలు విషయం ఏమిటంటే..

23 నవంబర్ 2022 నుండి పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేస్తున్న సీవీ ఆనంద్ బోస్ మలయాళి. కేరళ కేడర్‌కు చెందిన 1977 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆనంద్ బోస్ ఇప్పటికే ఎన్నో భాషల్లో పుస్తకాలు రాశారు. పలు భాషలు నేర్చుకోవటం ఆయనకు ఇష్టం. పశ్చి బెంగాల్ గవర్నర్ గా పనిచేస్తున్న ఆయన బెంగాల్ కూడా నేర్చుకోవాలనుకున్నారు. ఇప్పటికే ఇంగ్లీసు, తన మాతృభాష అయిన మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 40 పుస్తకాలు రాసిన ఆనందబోస్‌.. బెంగాలీలోనూ ఓ పుస్తకం రాయాలని అనుకున్నారు. ఈ విషయాన్ని ఆయన పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులైన సమయంలోనే తెలిపారు. దీంతో ఆయన బెంగాల్ భాష నేర్చుకోవటానికి తన నివాసం రాజ్ భవన్ లోనే జనవరి 26న అక్షరాభ్యాసం చేయనున్నారు.

సాధారణంగా బెంగాలీ (బంగ్లా) భాషలోని అక్షరాలను నేర్చుకునే ప్రక్రియ ప్రారంభించే ముందు చిన్నపిల్లలకు ‘హతేఖోరీ’ పేరుతో సంప్రదాయ పద్ధతిలో అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. ఈ క్రమంలో బెంగాల్ సంప్రదాయ పద్ధతిలోనే గవర్నర్ ఆనంద్ బోస్ కూడా తాను బెంగాల్ భాష నేర్చుకోవటానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. అదే జనవరి 26. ఈరోజున గవర్నర్ ఆనంద్ బోస్ అక్షరాభ్యాస ముహూర్తం నిశ్చయించుకున్నారు. రాజ్ భవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరుకానున్నారు. కాగా ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. కేరళకు చెందిన సీవీ ఆనంద్ బోస్ తండ్రి పేరు వాసుదేవన్ నాయర్.ఆయనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఎంతో గౌరవం. అందుకే..వాసుదేవన్ నాయర్ పిల్లలందరి పేరులకు చివర బోస్ అనే పేరు పెట్టారట.