Student Credit Card : స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ప్రారంభించిన దీదీ

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ ఇచ్చిన కీలక హామీని దీదీ నెరవేర్చారు.

Student Credit Card : స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ప్రారంభించిన దీదీ

Mamata2

Student Credit Card బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ ఇచ్చిన కీలక హామీని దీదీ నెరవేర్చారు. వెస్ట్ బెంగాల్ లోని విద్యార్థుల కోసం స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను ఇవాళ సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు. ఇదొక అద్భుత పథకమని మమతా బెనర్జీ తెలిపారు. 10 ఏళ్లుగా బెంగాల్ లో నివసించే విద్యార్థులు(40 ఏళ్ల వయస్సు వరకు) ఈ కార్డు పొందేందుకు అర్హులని మమత తెలిపారు. అండర్ గ్రాడ్యేయేట్లు,పోస్ట్ గ్రాడ్యుయేట్లు,డాక్టర్ కోర్సు,పోస్ట్ డాక్టరల్ కోర్సులు చేసే విద్యార్థులకు ఈ కార్డు ద్వారా లోన్ లభిస్తుందని చెప్పారు.

ఈ కార్డు ద్వారా విద్యార్ధులు.. దేశంలో లేదా విదేశాల్లో చదువుకునేందుకు 10 ల‌క్ష‌ల రూపాయల వ‌ర‌కు లోన్ పొందవచ్చునని ఆన్ లైన్ మీడియా సమావేశంలో మమత తెలిపారు. కోర్సు ఫీజు,ట్యూషన్స్,హాస్టల్ ఫీజు,బుక్స్,స్టడీ మెటీరియల్స్,కంప్యూటర్స్,ల్యాప్ ట్యాప్స్ కొనడం వంటి వాటి కోసం లోన్ తీసుకోవచ్చునని దీదీ చెప్పారు.కోర్సు మధ్యలో కూడా లోన్ కోసం అప్లయ్ చేయవచ్చన్నారు. ఏ బ్యాంకు నుంచైనా(ప్రభుత్వ లేదా ప్రైవేట్ లేదా కొర్పొరేటివ్ సంస్థలు)ఈ ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చన్నారు. ఆన్ లైన్ ద్వారా విద్యార్థులు.. లోన్ కి అప్లయ్ చేయవచ్చన్నారు. ఈ రుణం పొందేందుకు గ్యారెంటర్ అవసరం కూడా లేదని మమత చెప్పారు. 15 సంవత్సరాల్లోపు తీసుకున్న రుణాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ఆ రుణంపై వార్షికంగా అతి స్వ‌ల్ప స్థాయిలో వ‌డ్డీ వ‌సూల్ చేయ‌నున్నట్లు సీఎం మ‌మ‌తా తెలిపారు.

ఈ క్రెడిట్ కార్డు స్కీమ్ వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి ఆందోళన చెందరని తెలిపారు. భవిష్యత్ రోజుల్లో ఈ లోన్ విద్యార్ధుల కలలను సాకారం చేయడం ఈ లోన్ సాయపడుతుందని మమత ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్ధులు డబ్బు గురించి ఆందోళన చెందకుండా తమ చదువులపై ఫోకస్ పెట్టాలని మమత సూచించారు.

కాగా, దేశంలో స్టూడెంట్ క్రెడిట్ కార్డులు తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. బీహార్ లో కూడా స్టూడెంట్ క్రెడిట్ కార్డు పథకాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐసీఐసీఐ,హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్,యాక్సిస్ బ్యాంక్ వంటి కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే విద్యార్థలుకు క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి.