కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుని శ్వాస అందక మృతి..

వెస్ట్ బెంగాల్ లోని సీనియర్ సిటిజన్ ఒకరు కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని కొద్ది రోజులకే చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ చేశారు. జల్పయ్‌గురి జిల్లాలో ఉంటున్న కృష్ణ దత్త(64) లోకల్ హాస్పిటల్ లోనే ..

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుని శ్వాస అందక మృతి..

dead body

COVID vaccine: వెస్ట్ బెంగాల్ లోని సీనియర్ సిటిజన్ ఒకరు కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని కొద్ది రోజులకే చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ చేశారు. జల్పయ్‌గురి జిల్లాలో ఉంటున్న కృష్ణ దత్త(64) లోకల్ హాస్పిటల్ లోనే మంగళవారం ట్రీట్మెంట్ తీసుకుంటూ శ్వాస అందకపోవడంతో చనిపోయాడు.

సోమవారం వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి.. రాత్రి నుంచి శ్వాస అందలేదు. మళ్లీ కాసేపటికి హాస్పిటల్ కు తీసుకెళ్లగా మధ్యలోనే ప్రాణాలొదిలేశాడు. ఆటోప్సీ కోసం డెడ్ బాడీని జల్పైగురి రాష్ట్ర జనరల్ హాస్పిటల్ కు తరలించారు. మొత్తం లక్షా 60వేల 435మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా సమాచారం.

ఫస్ట్ డోస్ లో భాగంగా లక్షా 37వేల 642మందికి, రెండో డోస్ లో 22వేల 793మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వారిలో 54వేల 782మంది 60ఏళ్లు పైబడ్డవారే. 19వేల 234మంది 45నుంచి 59ఏళ్ల మధ్య వయస్కులు.

వెస్ట్ బెంగాల్‌లో మంగళవారం వరకూ వ్యాక్సిన్ అందుకున్న వారు 18.34లక్షల మంది ఉన్నారు. ఆ రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయిన వారు 10వేల 281మంది అని రికార్డులు చెబుతున్నాయి. మొత్తం 5లక్షల 77వేల 26మందికి వైరస్ సోకగా.. 188ఫ్రెష్ కేసులు ఉన్నాయి.