Calcutta HC : మమతకి బిగ్ షాక్..ఎన్నికల ఫలితాల అనంతర హింసపై సీబీఐ దర్యాప్తు

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ)దర్యాప్తు జరగాలని, దీనికి సంబంధించిన కేసులన్నీ సీబీఐకి

Calcutta HC : మమతకి  బిగ్ షాక్..ఎన్నికల ఫలితాల అనంతర హింసపై సీబీఐ దర్యాప్తు

Begngal

Calcutta HC పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ)దర్యాప్తు జరగాలని, దీనికి సంబంధించిన కేసులన్నీ సీబీఐకి అప్పగించాలని గురువారం మధ్యాహ్నాం కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తునకు సీబీఐ ప్రత్యేక బృందం ఏర్పాటుచేయాలని..ఈ ప్రత్యేక బృందలో కోల్‌కతా పోలీస్ కమిషనర్ సౌమేన్ మిత్రాను కూడా చేర్చాలని 5 గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం సూచించింది.

మే 2న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా… అదే రోజు సాయంత్రం నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం కొన్ని రోజులు కొనసాగిన ఈ హింసాత్మక ఘటనల్లో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దాడులకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే, నకిలీ వీడియోలు, ఫోటోలతో తమ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయడానికే ఆరోపణలు చేస్తున్నారని అధికార టీఎంసీ ఖండించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని, వాటిని కొట్టివేయాలని బెంగాల్ ప్రభుత్వం కోరింది. అంతేకాదు, ఫలితాల అనంతరం జరిగిన ప్రతి హింసను ఎన్నికలతో సంబంధం ఉన్నట్టు భావించకూడదని పేర్కొంది.

ఈ సమయంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసపై దర్యాప్తు జరిపిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. తన నివేదికను జులై 15 న హైకోర్టుకు సమర్పించింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా బదులు రూల్ ఆఫ్ రూలర్ విధానం నడుస్తోందని ఈ సంఘం తన 50 పేజీల నివేదికలో పేర్కొంది. పాలక పార్టీ మద్దతుదారులు.. విపక్ష కార్యకర్తలపై దాడులకు దిగారని, అత్యాచారాలు, హత్యల వంటి దారుణాలు జరిగాయని ఈ రిపోర్టులో తెలిపింది. ఈ కేసుపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించాలని, విచారణ రాష్ట్రం బయట జరగాలని కూడా ఈ సంఘం సూచించింది.

కలకత్తా హైకోర్టు గత నెల 2 న కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఎన్నికల అనంతరం హింస జరగలేదని ప్రభుత్వం చెబుతోందని, కానీ జరిగిందనడానికి ఈ నివేదికే నిదర్శనమని పేర్కొంది. అయితే బెంగాల్ ప్రభుత్వంపై మానవ హక్కుల సంఘం చేసిన ఆరోపణలను ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తోసిపుచ్చారు. ఆ సంఘంలోని కొంతమంది సభ్యులకు విపక్ష బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన కోల్ కతా హైకోర్టు..ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ)దర్యాప్తు జరగాలని, దీనికి సంబంధించిన కేసులన్నీ సీబీఐకి అప్పగించాలని గురువారం మధ్యాహ్నాం ఆదేశాలు జారీ చేసింది.