Bangalore Auto Driver: హిందీ-కన్నడ గొడవ.. ‘నార్త్ ఇండియన్ బిచ్చగాళ్లు’ అంటూ తిట్టిన ఆటో డ్రైవర్

దానికి కన్నడ ఆటో డ్రైవర్ కాస్త కఠినంగానే సమాధానం ఇచ్చాడు. తన ప్రాంతంలో ఉండి తన భాష మాట్లాడాలని అంటూనే ‘మీ నార్త్ ఇండియా అడుక్కు తినేవాళ్లు’ అంటూ తిట్టాడు. అయితే వీరి సంభాషణ అటు హిందీలో కాకుండా, ఇటు కన్నడలో కాకుండా ఇంగ్లీషులో కొనసాగడం గమనార్హం. ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Bangalore Auto Driver: హిందీ-కన్నడ గొడవ.. ‘నార్త్ ఇండియన్ బిచ్చగాళ్లు’ అంటూ తిట్టిన ఆటో డ్రైవర్

Bengalore auto driver lashes out at north passenger over hindi and kannada argument

Bangalore Auto Driver: రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. కన్నడకు చెందిన ఒక ఆటో డ్రైవర్‭తో నార్త్ ఇండియాకు చెందిన ప్రయాణికురాలికి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ వాగ్వాదం భాషకు సంబంధించింది. కన్నడలో మేం ఎందుకు మాట్లాడాలంటూ నార్త్ ఇండియాకు చెందిన ఇద్దరు ప్రయాణికులు స్పందించగా, దానికి కన్నడ ఆటో డ్రైవర్ కాస్త కఠినంగానే సమాధానం ఇచ్చాడు. తన ప్రాంతంలో ఉండి తన భాష మాట్లాడాలని అంటూనే ‘మీ నార్త్ ఇండియా అడుక్కు తినేవాళ్లు’ అంటూ తిట్టాడు. అయితే వీరి సంభాషణ అటు హిందీలో కాకుండా, ఇటు కన్నడలో కాకుండా ఇంగ్లీషులో కొనసాగడం గమనార్హం. ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Same-Sex Marriage: స్వలింగ సంపర్క వివాహాన్ని వ్యతిరేకించిన కేంద్రం.. సుప్రీంకు అఫిడవిట్

బెంగళూరులో కస్తూరి నగర్ వెళ్లడానికి నార్త్ ఇండియన్ యువతులు ఆటో ఎక్కారు. అయితే ఆటో ఎక్కే సమయంలోనే భాష గురించి వాగ్వాదం ఏర్పడింది. యువతులను కన్నడలో మాట్లాడమని ఆటో డ్రైవర్ కోరాడు. అయితే దానికి వారు కాస్త దురుసుగా బదులిచ్చారు. ‘‘మేము కన్నడలో మాట్లాడము, కన్నడలో ఎందుకు మాట్లాడాలి?” అని అన్నారు. దీనికి కోపోద్రిక్తుడైన ఆ డ్రైవర్.. ‘‘నేనెందుకు హిందీలో మాట్లాడాలి? మీరు బతకడానికి మా రాష్ట్రం వచ్చారు. ఇది కన్నడ ప్రాంతం. కన్నడలోనే మాట్లాడాలి. మీరు ఉత్తర భారత బిచ్చగాళ్ళు. ఇది మా భూమి, మీ భూమి కాదు. నేను హిందీలో ఎందుకు మాట్లాడాలి?” అంటూ ఇంగ్లీషులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారిని ఎక్కించుకున్న ప్రాంతంలోనే దింపేశాడు.


వాస్తవానికి ఇలాంటివి తమిళనాడులో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. హిందీ వ్యతిరేకోద్యమం ప్రభావం కావొచ్చు. ఇప్పటికీ కొన్ని సందర్భాలు కనిపిస్తూనే ఉంటాయి. రాజకీయంగా కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇక కన్నడ భాషాభిమానం కూడా కొంత ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఈ ప్రభావం అంతో ఇంతో ఉంటుంది. నిజానికి ఏ భాషను ఎవరిపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దు. పెద్దదా, చిన్నదా అని కాదు. ప్రతి భాష.. ఆ భాష మాట్లాడే వారికి గౌరవమే. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. నెటిజెన్లు తమ తమ అభిప్రాయాలను దీనిపై వెల్లడిస్తున్నారు.