పెరుగుతున్న కరోనా కేసులు..బెంగుళూరులో మ‌రో అపార్ట్‌మెంట్ సీజ్‌

పెరుగుతున్న కరోనా కేసులు..బెంగుళూరులో మ‌రో అపార్ట్‌మెంట్ సీజ్‌

bengaluru బెంగళూరులో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరిగాయి. 1500 మంది నివాసితులు ఉండే ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ప‌ది మందికి కోవిడ్ వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి 22వ తేదీ మ‌ధ్య వారంతా పాజిటివ్‌గా తేలిన‌ట్లు బీబీఎంపీ క‌మీష‌నర్ మంజునాథ్ ప్ర‌సాద్ తెలిపారు. దీంతో ఆరు బ్లాక్‌ల‌ను కంటేన్మెంట్ జోన్లుగా ప్ర‌క‌టించారు.

ఆ రెసిడెన్షియ‌ల్ సొసైటీలో రెండు మ్యారేజ్ పార్టీలు జ‌‌రిగిన త‌ర్వాత కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరిగాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో భారీ స్థాయిలో టెస్టింగ్ డ్రైవ్ నిర్వ‌హించింది. ప‌రీక్ష‌ల్లో పాజిటివ్‌గా తేలిన వారిలో ఎక్కువ శాతం మంది 50 ఏళ్ల లోపు వాళ్లే ఉన్నారు. మ‌హారాష్ట్ర‌, కేర‌ళ త‌ర్వాత అత్య‌ధిక కోవిడ్ కేసులు క‌ర్నాట‌క‌లోనే ఉన్నాయి.

మరోవైపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబైలో ఇప్పటి వరకు 1,305 బిల్డింగ్స్ కు సీల్ వేశారు బీఎంసీ అధికారులు. దీంతో 70వేలకు పైగా గృహ నివాసితులు ప్రభావితమయ్యారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో మరిన్ని భవనాలకు సీల్‌ వేసే అవకాశం ఉంది.