Bengaluru CCB Drive : విదేశీయులపై సీసీబీ దాడి..

కర్ణాటక రాజధాని బెంగళూరులో నివాసం ఉంటున్న విదేశీయులపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. విదేశీలయుల నివాసాలపై కేంద్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి వీసా గడువు ముగిసినా ఇంకా భారత్ నుంచి వెళ్లని 38మందిని గుర్తించారు.

Bengaluru CCB Drive : విదేశీయులపై సీసీబీ దాడి..

Bengaluru Ccb Drive

Bengaluru CCB drive : కర్ణాటక రాజధాని బెంగళూరులో నివాసం ఉంటున్న విదేశీయుల నివాసాలపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం (జులై 15,2021) విదేశీలయుల నివాసాలపై కేంద్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి వీసా గడువు ముగిసినా ఇంకా భారత్ నుంచి వెళ్లని 38మందిని గుర్తించారు. వీసా గడువు ముగిసినా పలువురు విదేశీలు ఇంకా నగరంలోనే ఉంటున్నారని గుర్తించారు.

ఈ మెరుపు దాడుల గురించి సీసీబీ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ మాట్లాడుతూ..బెంగళూరు ఈస్ట్‌ విభాగంలో ఆరుగురు ఏసీపీలు, 20 మంది ఇన్‌స్పెక్టర్లు, 100 మందికి పైగా పోలీసులు ఈ దాడుల్లో పాల్గొన్నారని వెల్లడించారు. పలు విదేశీలులు ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు చెందిన వారు డ్రగ్స్ వ్యాపారాలు చేస్తున్నారనీ పలు అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తూ..మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 38మందిని వీసా గడువు ముగిసినా నగరంలోనే ఉన్నట్లుగానే గుర్తించామని తెలిపారు.

ఈ దాడుల్లో భాగంగా కొంతమంది నివాసాల్లో గంజాయి వంటి పలురకాల మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయని వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని..వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టాల క్రింద కేసులను నమోదు చేశామని తెలిపారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా చాలామంది దేశంలో ఉంటున్న వారి వివరాలను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళతామన్నారు.

ఒక వేళ కేంద్రం సిఫార్సు చేస్తే వీసా పరిధి పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామనీ..వీసా గడువు ముగిసిన వెంటనే విదేశీయులు నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో తెలియజేయాల్సి ఉంటుందని వెల్లడించారు. కానీ పలు రకాల వీసాలపై భారత్ వచ్చినవారిలో చాలామంది ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు చెందిన వారు ఏమాత్రం నిబంధనలు పాటించట్లేదని అన్నారు. అటువంటివారు బెంగళూరు నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నివసిస్తున్నట్లుగా తేలింది. అటువంటివారిని గుర్తించి తీసుకోవాల్సిన చర్యలు సుకుంటామని..అలాగే పలు విభాగాల్లో విదేశీయుల నివాసాలపై కన్నేసి ఉంచామని తెలిపారు.