Monkeypox Treatment: మంకీపాక్స్ ట్రీట్మెంట్‌కు ట్రైనింగ్ తీసుకుంటున్న బెంగళూరు డాక్టర్లు
బృహత్ బెంగళూరు మహానగర పాలికె డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. అంతర్జాతీయంగా కనిపిస్తున్న మంకీపాక్స్ కేసులతో అప్రమత్తమైంది. ఈ వైరల్ జబ్బు లక్షణాలను పసిగట్టేందుకు వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది.

Monkeypox Treatment: బృహత్ బెంగళూరు మహానగర పాలికె డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. అంతర్జాతీయంగా కనిపిస్తున్న మంకీపాక్స్ కేసులతో అప్రమత్తమైంది. ఈ వైరల్ జబ్బు లక్షణాలను పసిగట్టేందుకు వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఇవేకాకుండా, దేశంలో కొవిడ్-19 కేసులు 11వేల నుంచి 15వేల వరకూ పెరిగినట్లు బీబీఎంపీ స్పెషల్ కమిషనర్ రంగప్ప వెల్లడించారు.
దాదాపు 12 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నందున, వ్యాధి లక్షణాలు, వ్యాధితో జబ్బుపడిన వ్యక్తులను ప్రయాణించి వచ్చే దేశాల నుండి అప్రమత్తంగా ఉండాలని, వారిని ఐసోలేషన్ లో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం విమానాశ్రయాలను కోరింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ (IDSP) కింద ఆరోగ్య శాఖ అధికారులు వ్యాధి లక్షణాలు, సూచనలను తెలియజేస్తూ మధ్యంతర సలహా పంపించారు.
“ప్రమాదకర దేశాల నుండి ఎవరైనా యాత్రికుల్లో దద్దుర్లు ఉన్నట్లయితే లేదా 21 రోజులలో ధ్రువీకరించబడిన లేదా అనుమానిత కేసులు కనిపిస్తే.. ఆరోగ్య కేంద్రాలకు సమాచారం అందించాలి”అని సూచించారు.
Read Also: మంకీపాక్స్ వ్యాక్సినేషన్స్‌కు అంత అర్జెంట్ లేదు – WHO
లైంగిక క్రియ ద్వారా కూడా వ్యాప్తి
అనుమానిత వ్యక్తులు 21 రోజులపాటు బయట తిరగకూడదనీ, వృద్ధులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, 12 ఏళ్లలోపు బాలబాలికలకు సమీపంగా వెళ్లరాదని వెల్లడించింది. ఆఫ్రికా మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో కోతుల్లో కనిపించే ఈ వ్యాధి.. అక్కడి నుంచి ఐరోపా, బ్రిటన్ లకు పాకింది.
బ్రిటన్ లో 20, ఐరోపా, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. కోతుల్లోనే కనపించే ఈ వైరస్ వ్యాధి అంత తేలిగ్గా మనుషులకు సంక్రమించదు. వ్యాధి పీడితులకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికే త్వరగా సోకుతుంది. అలాగే లైంగిక క్రియ ద్వారా కూడా వైరస్ సోకుతుంది.
- Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి ప్రధాన కారణమేంటో చెప్పిన డబ్ల్యూహెచ్ఓ.. మీరూ పాటించండి..
- Covid in Bengaluru : బెంగళూరులో మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
- Monkeypox: మంకీపాక్స్పై అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలకు సూచనలు
- KGF Babu : కేజీఎఫ్ బాబు ఇంటిపై ఐటీ దాడులు
- Monkeypox : మంకీపాక్స్ సోకిన వారు మూడు వారాలు వీటికి దూరంగా ఉండాలి
1Patna High Court : జడ్జీల కోసం ఐఫోన్ 13ప్రో తక్కువ ధరకే కొననున్న పట్నా హైకోర్టు..!
2Rythu Bandhu: 28 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు
3Uddhav Thackeray: అవసరమైతే రాజీనామాకు సిద్దం: ఉద్ధవ్ థాక్రే
4Telegram Premium : టెలిగ్రామ్ మానిటైజేషన్ ప్లాన్ వచ్చేసింది.. ప్రీమియంతో బెనిఫిట్స్ ఏంటి?
5Avula Subba Rao : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. 10టీవీ చేతిలో సెకండ్ రిమాండ్ రిపోర్ట్.. సూత్రధారులు ఆ ఇద్దరే
6Ramarao On Duty: రామారావు చార్జి తీసుకునేది అప్పుడే!
7Secunderabad Riots : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. మరో 10మంది అరెస్ట్, తమ పిల్లలు అమాయకులంటున్న తల్లిదండ్రులు
8Rahul Gandhi: ‘అగ్నిపథ్’ను కేంద్రం వెనక్కు తీసుకోవాలి: రాహుల్ గాంధీ
9Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వస్తోంది.. జూలైలోనే లాంచ్..!
10Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్
-
Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
-
Samsung Galaxy F13 : శాంసంగ్ గెలాక్సీ F13 వచ్చేసింది.. ఈ నెల 29 నుంచే సేల్.. ధర ఎంతంటే?
-
Vaarasadu: ‘వారసుడు’ రాకతో నిజమైన సంక్రాంతి..!
-
Telugu Film Industry Strike: ఫిలిం ఛాంబర్లో నిర్మాతల సమావేశం.. షూటింగ్ ఆపేదే లేదు!
-
Pelli SandaD: పెళ్లిసందD ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్!
-
Vaishnav Tej: రాముడు కాదప్ప.. రుద్ర కాళేశ్వరుడు..!
-
Film Chamber: సినిమా కార్మికుల సమ్మెపై ఫిలిం ఛాంబర్ సమావేశం
-
Electric Shock : దేవాలయానికి మైకులు కడుతుండగా విషాదం..విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి