Congress Leader Video : బీజేపీ ఎమ్మెల్యే హత్యకు కాంగ్రెస్ నేత ప్లాన్.. వీడియో వైరల్

ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను చంపేయమని విపక్ష పార్టీ నేత ఓ వ్యక్తికి ఆదేశాలిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు కర్నాటక పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న

Congress Leader Video :  బీజేపీ ఎమ్మెల్యే హత్యకు కాంగ్రెస్ నేత ప్లాన్.. వీడియో వైరల్

Karnataka (2)

Congress Leader Video:  ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను చంపేయమని విపక్ష పార్టీ నేత ఓ వ్యక్తికి ఆదేశాలిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు కర్నాటక పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న 3నిమిషాల నిడివిగల ఓ వీడియోలో.. బెంగళూరులోని యలహంక బీజేపీ ఎమ్మెల్యే,బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీ(BDA) చైర్మన్ ఎస్ఆర్ విశ్వనాథ్ ను హత్యకు కాంగ్రెస్ నేత గోపాల క్రిష్ణ పథకం వేసినట్లు కనిపిస్తోంది.

మూడు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో కాంగ్రెస్ నేత గోపాల క్రిష్ణ ఓ సోఫాలో కూర్చొని ఉన్నాడు. తన పక్కనే ఉన్న వ్యక్తితో గోపాల క్రిష్ణ మాట్లాడుతూ… ‘‘ఆ బీజేపీ ఎమ్మెల్యేని ఫినిష్‌ చేయ్‌. చంపెయ్‌. నీకు కోటి రూపాయలు ఇస్తాను. ఇంకా ఎక్కువైనా పర్వాలేదు. దీని గురించి ఎవరికి తెలియకూడదు. ఈ విషయం మన ఇద్దరి మధ్యే ఉండాలి’’ అని అన్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిదనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కర్నాటక రాజకీయాల్లో సెగలు రేపుతుండడంతో స్వయంగా హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. ఈ విషయమై ఎమ్మెల్యే విశ్వనాథ్ కూడా తనో మాట్లాడారని చెప్పారు. విశ్వనాథ్‌కు భద్రత కల్పించాలని భావిస్తున్నామని, దీనిపై ఇంటిలిజెన్స్‌ శాఖ నిర్ణయం తీసుకుంటుందని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర పేర్కొన్నారు.

కాగా,ఎస్‌ఆర్ విశ్వనాథ్ బుధవారం రాజనకుంటె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వీడియోలోని మరో వ్యక్తినికుల్లా దేవరాజ్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇక,గోపాల్ కృష్ణ మాత్రం మీడియాలో వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ వీడియో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపి ఎమ్మెల్యే పన్నిన “కుట్ర” అని పేర్కొన్నారు.

కాగా, బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ యెలహంక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2018లో ఆయనపై కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేసిన వ్యక్తే గోపాలకృష్ణ విశ్వనాథ్‌. ఆ ఎన్నికల్లో 80 వేల ఓట్ల తేడాతో గోపాలకృష్ణ ఓడిపోయారు. అంతకుముందు ఎన్నికల్లో కూడా ఎస్ఆర్ విశ్వనాథ్ పై పోటీ చేసి ఓడిపోయారు గోపాలకృష్ణ.  అయితే వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ లేకుండా చేసేందుకే విశ్వనాథ్‌పై హత్యకు కుట్ర పన్నారా,ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉందని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. 

ALSO READ AP CM Jagan : నేను ఉన్నా..రెండో రోజు వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన