Updated On - 1:56 pm, Thu, 23 July 20
By
madhuకరోనా వైరస్ ను అరికట్టేందుకు..రోగులకు చికిత్స చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఆ డాక్టర్. కానీ అదే డాక్టర్ కు వైరస్ సోకితే…మూడు ఆసుపత్రులు చేర్చుకొనేందుకు నో చెప్పాయి. ఫలితంగా…వైరస్ తో పోరాడుతూ కన్నుమూశాడు ఆ కరోనా యోధుడు. ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.
బెంగళూరు నగరంలోని రామ్ నగర్ జిల్లా కనకపురా తాలుకూలోని చిక్కలముడివాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ 19 విధులు నిర్వహించారు డాక్టర్ మంజునాథ్. ఈ క్రమంలో ఆయనకు వైరస్ సోకింది. చికిత్స చేయించుకొనేందుకు ప్రైవేటు ఆసుపత్రుకు వెళ్లారు.
మూడు ఆసుపత్రులు చేర్చుకొనేందుకు నిరాకరించాయి. చివరకు బెంగళూరు మెడికల్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో చేరిపించారు. అక్కడ చికిత్స అందచేసినా ప్రాణాలు నిలువలేదు. వైరస్ తీవ్రంగా శరీరంలోకి వెళ్లిపోవడంతో 2020, జులై 23వ తేదీ గురువారం తుదిశ్వాస విడిచారు. అయితే..ఆయన కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు కూడా కరోనా వ్యాధితో చనిపోవడం అందర్నీ కలిచివేసింది.
జూన్ 25వ తేదీన శ్వస తీసుకోవడంలో మంజునాథ్ ఇబ్బంది పడ్డారని, అనుమానిత కేసు కావడంతో పరీక్షల కోసం నమూనాలను పంపామని అతని బంధువు BBMP మెడికల్ ఆఫీసర్ డా.నాగేంద్ర కుమార్ వెల్లడించారు. తాము వైద్యులమని తెలిసినా…ఆసుపత్రుల వార చేర్చుకోలేదని, కరోనా నిర్ధారణ ఫలితాల నివేదిక రాలేదని వెనక్కి పంపారని వివరించారు.
కుమరస్వామి లే అవుట్ లో ఉన్న ఓ ఆసుపత్రి నిరాకరించడంతో అక్కడే బైఠాయించామన్నారు. ఆ తర్వాత చేర్చుకున్నారని, పరిస్థితి కొంత మెరుగుపడిన తర్వాత…జులై 09వ తేదీన BMRC కి తరలించి వెంటిలెటర్ పై చికిత్స అందించారన్నారు. ఇక్కడ మంజునాథ్ కు ఫిజియోథెరపిస్ట్ అవసరం ఉందని, కానీ పీపీఈ కిట్ ధరించి..కోవిడ్ ఐసీయూలోకి ప్రవేశించడానికి ఫిజియోథెరపిస్టు అంగీకరించలేదన్నారు.
కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నుమూత
ఈ ఒక్క దృశ్యం చాలు.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి
lovers ends life : ప్రేమలో గెలిచి… జీవితంలో ఓడిన ప్రేమజంట
తెలంగాణలో కరోనాపై హైఅలర్ట్.. ఆసుపత్రులను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
Corona Vaccines : వ్యాక్సిన్ ప్లీజ్, మూతపడిన కేంద్రాలు.. ఒత్తిడి ఉందంటున్న సీరమ్
AirAsia Flight : విమానంలో బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడు