కార్లు ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేస్తే..పర్సు ఖాళీ

కార్లు ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేస్తే..పర్సు ఖాళీ

Bengaluru gets new parking policy : కార్లు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారా ? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే. డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంటి ముందు రోడ్డుపై కారును నిలపాలన్నా…కుదరదు. పార్కింగ్ పాలసీ…అమల్లోకి వస్తే..మాత్రం రూల్స్ తు.చ. తప్పకుండా పాటించాల్సి వస్తుంది. నగరంలో ట్రాఫిక్, వాహనాల పార్కింగ్ సమస్యను నివారించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇదంతా…హైదరాబాద్ లో మాత్రం కాదులెండి..బెంగళూరు నగరంలో. కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ విధానం త్వరలోనే అమల్లోకి రానుంది.

పార్కింగ్ పాలసీ 2.0కు పట్టణ అభివృద్ధి శాఖ ఆమోదించింది. అమల్లోకి వస్తే..బెంగళూరు నగర వాసులు తమ వాహనాలను పబ్లిక్ రోడ్డుపై కారు నిలిపితే..రూ. వెయ్యి నుంచి రూ. 5 వేల వరకు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక, త్రైమాసిక విధానంలో పార్కింగ్ పర్మిట్ ను ప్రజలు కోనుగోలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాహనాల పేరిటే ఈ పర్మిట్ ఇస్తారు. కేవలం ఒక్క వాహనానికి మాత్రమే పర్మిట్ ఇస్తారు. వారు అనుమతించిన స్థలంలోనే..వాహనాన్ని పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

గడువు ముగిసిన తర్వాత..మరలా..పార్కింగ్ పర్మిట్ ను రెన్యూవల్ చేసుకోవాలి. నిబంధనలు పాటించకపోతే..మాత్రం జరిమాన తప్పదు. చిన్న కార్లకు అయితే ఏడాదికి రూ.వెయ్యి మధ్యస్థాయి కార్లకు రూ.4 వేలు, ఎంయూవీ, ఎస్‌యూవీ వంటి పెద్ద కార్లకు రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. పాగ్‌ ప్రణాళిక ఖరారు కోసం డైరెక్టరేట్ ఆఫ్ అర్బన్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ (డీయూఎల్టీ), బ్రూహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) కలిసి జోనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాయి.