హనుమంతుడి గుడి కోసం ఖరీదైన స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ముస్లిం

  • Published By: nagamani ,Published On : December 9, 2020 / 10:44 AM IST
హనుమంతుడి గుడి కోసం ఖరీదైన స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ముస్లిం

Bengaluru Muslim man donates costly land to Hanuman temple : భారతదేశం విభిన్న మతాల కలయిక. మతాల పేరుతో కొన్ని చోట్ల కొంతమంది కొట్టుకు చస్తుంటే..మరికొన్నిచోట్ల మతసామర్యానికి ప్రతీకగా నిలిచేవారు ఎందరో ఉన్నారు. ఇలా భిన్న మతాలు..విభిన్న మనస్తత్వాల కలయిగా భారత్ ఎప్పుడు విలసిల్లుతుంటుంది. మతసామర్యం మా భారతీయుల సొంతం అనే మరో సందర్భం జరిగింది. అదే ఓ ముస్లిం వ్యక్తి హిందూ దేవాలయానికి ఖరీదైన స్థలాన్ని విరాళంగా ఇచ్చారు.



వివరాల్లోకి వెళితే..హెచ్ఎంజీ బాషా అనే 65 ఏళ్ల ముస్లిం లారీ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తుంటారు. కులాలు మతాలతో సంబంధం లేకుండా బాషా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ క్రమంలో బాషా హనుమంతుడి దేవాలయం నిర్మాణానికి ఖరీదైన స్థలాన్ని విరాళంగా ఇచ్చి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు.



వలగెరెపుర గ్రామంలో ఉన్న ఓ చిన్న హనుమాన్ దేవాలయం గురించి బాషాకు తెలిసింది. ఆ గుడిలో హనుమంతుడిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులు గుడి చిన్నగా ఉండటంతో ప్రదక్షిణలు చేయటానికి ఇబ్బందిగా ఉందని తెలుసుకున్నారు. దీంతో బాషా తన పెద్ద మనస్సును చాటుకున్నారు. హనుమాన్ దేవాయలాన్ని డెవలప్ చేయటానికి 120 గజాల భూమి అవసరం అని తెలుసుకున్నారు.



ఈ విషయాన్ని హనుమాన్ భక్తుల ద్వారా తెలుసుకున్న భాషా హనుమాన్ దేవాలయాన్ని సందర్భించారు. గుడిని పరిశీలించారు. అక్కడి పరిస్థితి తెలుసుకున్న బాషా గుడి పక్కనే తనకున్న 180 గజాల స్థలాన్ని ఇస్తానని హామీ ఇచ్చి తన పెద్ద మనసుని చాటుకున్నారు.



తన స్థలంలో హనుమాన్ దేవాయలం నిర్మాణం ఉండటం తనకు చాలా సంతోషమని..చాలా గర్వకారణమని తెలిపారు బాషా. కానీ ఓ ముస్లిం వ్యక్తి పైగా ఓ వ్యాపారస్తుడు హిందూ దేవాలయానికి విరాళం ఇస్తాననంటే స్థానికులు నమ్మలేకపోయారు. కానీ బాషా గట్టిగా హామీ ఇవ్వడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.


బాషా గుడికోసం ఇచ్చిన స్థలం ఖరీదు 80 లక్షల రూపాయలు నుంచి కోటి రూపాయలు పలుకుతోంది. కానీ అదేమీ లెక్కచేయకుండా ఓ ముస్లిం అయి ఉండీ హిందూ దేవాలయానికి ఆయన అంత ఖరీదైన స్థలం ఇవ్వటంతో వలెగెరెపుర గ్రామస్తులు ఎంతో సంతోషించారు. చేతులెత్తి మొక్కారు. ఆయనకు అభినందనలు తెలుపుతూ.. ఓ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు.



ఆ ఫ్లెక్సీలో బాషా, ఆయన భార్య ఫోటోలను పెట్టి అభినందనలుతెలిపారు. మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని బాషా సాటిచెప్పారని ఇటువంటి వ్యక్తుల వల్లనే భారతదేశంలో మతసామరస్యం వెల్లివిరుస్తోందని కొనియాడారు. రాజకీయ నాయకులే హిందూ, ముస్లింల మధ్య తేడాలు చూస్తున్నారని..ప్రజల్లో అటువంటి తేడాలు లేవు. రాజకీయనేతలు తమ లబ్ది కోసం మతాలమధ్య చిచ్చులు పెడుతుంటారని గ్రామస్థులు అంటున్నారు. అటువంటిపరిస్థితి మారి మతాలన్నీ ఒక్కటేననీ..ఏమతం చెప్పినా మనుషులంతా కలిసి మెలిసి ఉండాలనే చెబుతున్నాయని ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుంటే కులాలు..మతాల మధ్య తేడాలుండవని దేశప్రజలంతా ఐకమత్యంతో ఉండాలని బాషా ఈ సందర్భంగా కోరారు.




– – – – –
షిరిడీలో కొలువైన సాయిబాబా ఆలయం ముందు అంటించిన పోస్టర్లను తానే స్వయంగా తొలగిస్తానని, 10వ తేదీన తన కార్యకర్తలతో కలిసి వస్తున్నానని ప్రకటించిన తృప్తీ దేశాయ్ పై షిరిడీ సబ్ డివిజనల్ ఆఫీస్ నిషేధం విధించింది. 11వ తేదీ వరకూ ఆమెకు ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఆదేశాలను మీరి ఆమె ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



కాగా, ఇటీవల ఆలయంలోకి వచ్చే భక్తులు సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించాలని నిర్ణయించిన ఆలయ కమిటీ, ఈ మేరకు పోస్టర్లను ఆలయం గోడలపై ప్రదర్శనకు ఉంచింది. ఈ నిబంధనలను తప్పుబట్టిన తృప్తి, ఇతర సామాజిక కార్యకర్తలతో కలిసి తాను 10వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు స్వామి దర్శనానికి వచ్చి, స్వయంగా తానే పోస్టర్లను తొలగిస్తానని ప్రకటించిన మీదట, శాంతి భద్రతల సమస్యలు తలెత్తవచ్చన్న ఆలోచనతో, ముందు జాగ్రత్తగా ఈ మేరకు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు.