Bengaluru: డ్రగ్స్ తీసుకున్నోళ్లంతా జుట్టు కత్తిరించేసుకున్నారట!!

డ్రగ్స్ తీసుకున్న వాళ్లని చేసే ఎంక్వైరీలో భాగంగా వారి జుట్టును కూడా పరిశీలిస్తున్నారట. అందుకే ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా గుండు గీయించుకునే పనిలో..

Bengaluru: డ్రగ్స్ తీసుకున్నోళ్లంతా జుట్టు కత్తిరించేసుకున్నారట!!

Drugs Hair Tonsuring (1)

Bengaluru: డ్రగ్స్ తీసుకున్న వాళ్లని చేసే ఎంక్వైరీలో భాగంగా వారి జుట్టును కూడా పరిశీలిస్తున్నారట. అందుకే ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా గుండు గీయించుకునే పనిలో పడ్డారు. ఎందుకలా అంటే.. డ్రగ్స్ తీసుకున్న వారి వెంట్రుకల్లో దాదాపు 90రోజుల వరకూ వాటి అవశేషాలు ఉండిపోతాయి. దీంతో పోలిస్తే బ్లడ్, యూరిన్ వాటిల్లో కేవలం కొన్ని వారాలు మాత్రమే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

బెంగళూరు డ్రగ్స్‌ కేసు ప్రజాప్రతినిధుల గుండెల్లో అలజడి పుట్టిస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక పోలీసులు హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ముందస్తు జాగ్రత్తగా జుట్టు కత్తిరించేసుకుంటున్నారు.

టెక్నికల్ ఎవిడెన్స్‌పై ఫోకస్..
బెంగళూరు డ్రగ్స్‌ కేసులో పోలీసులు కొందరు ప్రముఖులను ఇంకా విచారించాల్సి ఉంది. నిందితుల సెల్‌ఫోన్‌ లొకేషన్‌ డేటా తెప్పించుకుని లిస్ట్ చేసుకుంటున్నారు. డ్రగ్స్‌ పెడ్లర్లకు, వారికి మధ్య జరిగిన వాట్సాప్‌ చాటింగ్, డ్రగ్స్‌ కోసం జరిగిన యూపీఐ, ఆన్‌లైన్‌ మనీ ట్రాన్‌శాక్షన్స్, బెంగళూరు ఫామ్‌ హౌజ్‌ పార్టీలకు ఎవరు వెళ్లారనేది నిర్ధారించేందుకు గూగుల్‌ టైం లైన్‌ డేటాను విశ్లేషిస్తున్నారని తెలిసింది.

డ్రగ్స్‌ సరఫరాను నిర్ధారించుకున్న అనంతరం.. ఎవరు వినియోగించారనే దానిపై పోలీసులు దృష్టి సారించే పనిలో పడ్డారు.