ఆటో వాలా మంచి మనస్సు : సన్మానించిన పోలీసులు

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 06:56 AM IST
ఆటో వాలా మంచి మనస్సు : సన్మానించిన పోలీసులు

బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు ఒక ఆటోడ్రైవర్‌ను సన్మానించారు. ఆ ఆటోడ్రైవర్ తనలోని నిజాయితీని చాటుతూ రూ. 10 లక్షల రూపాయలు కలిగిన బ్యాగును దాని యజమానికి అప్పగించాడు. 

ఆ డ్రైవర్ పేరు రమేష్ బాబు నాయక్. అతని ఆటోలో డాక్టర్ ఎంఆర్ భాస్కర్ ఎక్కారు. తరువాత ఆయన గమ్యస్థానికి చేరుకోవటం ఆటో దిగిపోయారు. ఈ క్రమంలో భాస్కర్ క్యాష్ బ్యాగ్ ను ఆటోలోనే మరచిపోయారు. ఇది గమనించిన రమేష్ బాబు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించాడు. అంతేకాకుండా..ఆ బ్యాగును భాస్కర్ కు అప్పగించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రమేష్‌ను అభినందించారు.అంతేకాదు రమేశ్ మెడలో దండ వేసి..శాలువా కప్పి స్వీట్లు, పండ్లు ఇచ్చి గౌరవంగా సన్మానించారు. 

సిటీ పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావు ఆ ఆటోడ్రైవర్‌ను అభినందించారు. క్యాష్ బ్యాగ్ పోగొట్టుకున్న డాక్టర్ ఎంఆర్ భాస్కర్ తాను ఆ సొమ్మును ఆపరేషన్ కోసం తీసుకెళుతున్నాననీ..ఆ క్యాష్ తిరిగి ఆటో డ్రైవర్ తెచ్చి ఇవ్వటం చాలా మంచి జరిగిందని అన్నారు. క్యాష్ బ్యాగును ఎంతో నిజాయితీగా అప్పగించిన డ్రైవర్‌కు భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.