Bengaluru Corona : ముంబై కన్నా దారుణం.. 100 మందిలో 55మందికి కరోనా.. కోవిడ్ క్లబ్‌గా మారిన బెంగళూరు

ఐటీ హబ్‌ నుంచి కరోనా క్లబ్‌గా మారిపోయింది బెంగళూరు. దేశంలో మరే నగరంలో లేని దారుణ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అక్కడ పాజిటివిటీ రేటు ఏకంగా 55శాతం నమోదైంది. అంటే వంద మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తే అందులో 55 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్థారణ అవుతుంది.

Bengaluru Corona : ముంబై కన్నా దారుణం.. 100 మందిలో 55మందికి కరోనా.. కోవిడ్ క్లబ్‌గా మారిన బెంగళూరు

Bengaluru Corona

Bengaluru Corona : ఐటీ హబ్‌ నుంచి కరోనా క్లబ్‌గా మారిపోయింది బెంగళూరు. దేశంలో మరే నగరంలో లేని దారుణ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అక్కడ పాజిటివిటీ రేటు ఏకంగా 55శాతం నమోదైంది. అంటే వంద మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తే అందులో 55 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్థారణ అవుతుంది. ఒక్కరోజు బెంగళూరులో 40 వేల 128 మందికి కరోనా టెస్టులు చేస్తే.. అందులో ఏకంగా 22 వేల 122 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ శాతం 30 దాటితేనే అదో భయంకరమైన కరోనా విపత్తుగా ఢిల్లీ భావిస్తే.. దానికి రెండు రెట్లు అధికంగా బెంగళూరులో పరిస్థితులు నెలకొన్నాయి.

బెంగళూరులో సగం మందికి కరోనా?
కరోనాతో కకావికలమవుతున్న మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా లేని దారుణ పరిస్థితులు బెంగళూరులో దాపురించాయి. కరోనాతో అల్లాడిపోతున్న ఢిల్లీలో కంటే ఇప్పుడు బెంగళూరులోనే కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఇక బెంగళూరు జనాభాలోని 24లక్షల మంది కరోనా రోగులతో ప్రైమరీ కాంటాక్ట్‌ అయినట్లు గుర్తించింది బెంగళూరు నగరపాలక సంస్థ. మరో 27లక్షల మంది కరోనా రోగులతో సెకండరీ కాంటక్ట్‌ అయినట్లు ఓ భయంకర నిజాన్ని బయటపెట్టింది. ఈ లెక్కన బెంగళూరులో సగం మందికి కరోనా ఉండే అవకాశాలు ఉన్నట్లు తేలింది. దానికి తగ్గట్లే టెస్ట్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి.

12 తర్వాత సంపూర్ణ లాక్ డౌన్:
నిత్యం పెరిగిపోతున్న కరోనా మరణాలతో.. శ్మశాన వాటిక నిర్వాహకులు వాటికి అంత్యక్రియలు చేయలేకపోతున్నారు. ఖననం చేయడానికి శ్మశానాల్లో ఖాళీ కూడా ఉండడం లేదు. పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుండడంతో.. ఈ నెల 12 తర్వాత పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధించనుంది అక్కడి ప్రభుత్వం. లాక్‌డౌన్ మాత్రమే తమకు ఇక ఉన్న ఏకైక మార్గమనే అభిప్రాయాన్ని సీఎం యడియూరప్ప వ్యక్తం చేశారు .