Bengaluru: రోడ్డుపై కుక్క కనిపిస్తున్నా కారు ఆపని డ్రైవర్.. కారు పైనుంచి వెళ్లడంతో కుక్క మృతి.. కేసు నమోదు

మనుషులుగా మూగజీవాలపై మానవత్వం చూపించడం మన బాధ్యత. అయితే, కొందరు మాత్రం వాటి విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. కర్కశంగా ప్రవర్తిస్తారు. తాజాగా బెంగళూరులో ఒక కారు రోడ్డుపై విశ్రాంతి తీసుకుంటున్న వీధి కుక్క మీది నుంచి దూసుకెళ్లింది.

Bengaluru: రోడ్డుపై కుక్క కనిపిస్తున్నా కారు ఆపని డ్రైవర్.. కారు పైనుంచి వెళ్లడంతో కుక్క మృతి.. కేసు నమోదు

Bengaluru: రోడ్లపై కొన్నిసార్లు కుక్కలు, గోవులు, ఇతర జంతువులు అడ్డుగా ఉంటాయి. అలాంటప్పుడు వాహనాలు నడిపేవాళ్లు కొద్దిసేపు ఆగి వెళ్లడమో లేదా వాటి పక్క నుంచి నెమ్మదిగా వెళ్లడమో చేస్తే చాలు.. అవి ప్రాణాలతో బయటపడతాయి.

West Bengal: మధ్యాహ్న భోజనంలో పాము.. అన్నం తిన్న పలువురు విద్యార్థులకు అస్వస్థత

మనుషులుగా మూగజీవాలపై మానవత్వం చూపించడం మన బాధ్యత. అయితే, కొందరు మాత్రం వాటి విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. కర్కశంగా ప్రవర్తిస్తారు. తాజాగా బెంగళూరులో ఒక కారు రోడ్డుపై విశ్రాంతి తీసుకుంటున్న వీధి కుక్క మీది నుంచి దూసుకెళ్లింది. ఇదేమీ పొరపాటుగా జరిగిన ఘటన కాదు. ఎందుకంటే కారు డ్రైవర్‌కు ఎదురుగా కుక్క ఉన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అతడు కావాలంటే కొన్ని క్షణాలు ఆగి హార్న్ ఇస్తే కుక్క వెళ్లిపోయేది. లేదా పక్క నుంచి వెళ్లినా కుక్క సేవ్ అయ్యేది. కానీ, అతడి రాక్షసత్వం వల్ల కుక్క మీది నుంచి ఒకవైపు రెండు టైర్లూ దూసుకెళ్లాయి. దీంతో కుక్క తీవ్రంగా గాయపడింది. రోడ్డుపై నొప్పితో గిలగిలా కొట్టుకుంది.

West Bengal: మధ్యాహ్న భోజనంలో పాము.. అన్నం తిన్న పలువురు విద్యార్థులకు అస్వస్థత

తీవ్ర గాయాలపాలైన కుక్క తర్వాత ప్రాణాలు కోల్పోయింది. స్థానిక ముత్తురాయ నగర పరిధిలో, గత శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఘటనపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. కారు డ్రైవ్ చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కుక్క విషయంలో అమానవీయంగా ప్రవర్తించిన డ్రైవర్‌పై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చర్యలు తీసుకుని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.