Bengaluru: ‘రూపాయి నాకు అమ్మితే రూ.కోటి ఇస్తా’

వృత్తి రీత్యా టీచర్ అయిన ఓ మహిళకు రూ.కోటి ఇస్తానంటూ నమ్మబలికి భారీగా డబ్బు దోచుకున్నాడో వ్యక్తి. ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో తన వద్ద ఉన్న 1947వ సంవత్సరం రూపాయి కాయిన్ అమ్ముతానని సదరు టీచర్ పెట్టారు.

Bengaluru: ‘రూపాయి నాకు అమ్మితే రూ.కోటి ఇస్తా’

Bengaluru Teacher Who Put Up 1947 Re 1 Coin On Olx Duped

Bengaluru: వృత్తి రీత్యా టీచర్ అయిన ఓ మహిళకు రూ.కోటి ఇస్తానంటూ నమ్మబలికి భారీగా డబ్బు దోచుకున్నాడో వ్యక్తి. ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో తన వద్ద ఉన్న 1947వ సంవత్సరం రూపాయి కాయిన్ అమ్ముతానని సదరు టీచర్ పెట్టారు. జూన్ 15న పెట్టిన పోస్టుతో ఫోన్ నెంబర్ కూడా ఉంచింది.

ఆ కాయిన్ కొనడానికి నేను రెడీగా ఉన్నానని కోటి రూపాయలు వరకూ ఇవ్వగలనని అన్నాడు. అంతే జాక్ పాట్ తగిలిందని భావించిన టీచర్.. నమ్మేసింది. అక్కడితో అతని నాటకం మొదలైంది.

డబ్బు పంపించడానికి బ్యాంకు అకౌంట్ వివరాలు అడిగాడు. ఫుల్ క్లారిటీతో అన్ని వివరాలు చెప్పిన తర్వాత ఆమెకు ఓ స్క్రీన్ షాట్ వచ్చింది. తాను డబ్బులు పంపానని ఇదే ఆ ట్రాన్సక్షన్ స్క్రీన్ షాట్ అని చెప్పాడు. తనకు డబ్బులు రాలేదని తెలుసుకున్న టీచర్ ప్రశ్నించేందుకు అతనికి తిరిగి ఫోన్ చేసింది.

అంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఖాతాలో డిపాజిట్ అవడానికి కొన్ని ట్యాక్స్ ల లాంటివి కట్టాలని చెప్పాడు. కొంచెం ఖర్చు అవుతుందని అలా చేస్తే డబ్బు జమ అవుతుందని అన్నాడు. ఆర్బీఐ, ట్యాక్స్ కూడా కట్టాల్సి ఉందని మరోసారి చెప్పాడు. ఇలా టీచర్ ఫోన్ చేసిన ప్రతిసారి నగదు పూర్తి కావడానికి ఏదో ఒక కారణంతో డబ్బులు అడుగుతూనే ఉన్నాడు. ఆమె ఇస్తూనే ఉంది.

అకౌంట్ కు మనీ పంపుతూ విసిగిపోయిన టీచర్.. కోటి వస్తుందా రాదా అని గట్టిగా నిలదీసింది. దాదాపు లక్షల్లో ట్రాన్సఫర్ చేసిన ఆమెకు రెస్పాన్స్ రావడం ఆగిపోయింది. అప్పటికి తేరుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించి పోలీస్ కంప్లైంట్ చేసింది. దీనిపై విచారణ మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.