Bengaluru Tragedy :ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..ఆకలితో అల్లాడి చనిపోయిన పసిబిడ్డ

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘనట బెంగళూరులో పెను విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనలో ఆకలితో అల్లాడి తొమ్మిది నెలల పసిబిడ్డ కూడా చనిపోవటం కలిచివేస్తోంది.

10TV Telugu News

Bengaluru Tragedy : కర్ణాటక రాజధాని బెంగళూరులో అత్యంత విషాదకరమైన విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన ఐదు రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. చిన్న విషయం పెను విషాదానికి దారి తీసింది. ఈ నలుగురు ఆత్మహత్యల ఘటనలో మరో అత్యంత విషాదం ఏమిటంటే పాలిచ్చే తల్లి చనిపోవటంతో తొమ్మిది నెలల పసిబిడ్డ ఆకలితో అలమటించి అల్లాడి ఏడ్చి ఏడ్చి చనిపోయేలా చేసింది. మరో చిన్నారి సొమ్మసిల్లిపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దుస్థితికి తెచ్చింది. తండ్రి కూతుర్ని అత్తారింటికి వెళ్లమన్నాడని వచ్చిన గొడవకాస్తా నాలుగు చావులకు కారణమైంది.పాలుతాగే తొమ్మిది నెలల పసిబిడ్డను కూడా మరచిపోయిందో ఏమో ఆ తల్లి తన ఆత్మహత్యతో ఓ బిడ్డ ఆకలి చావుకు మరో బిడ్డ స్మృహతప్పి పడిపోయేలా చేసింది.

Read more : Suicide : అప్పులబాధతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

బెంగళూరు నగరంలోని తిగరపాళ్య చేతన్ కూడలిలో 55 ఏళ్ల శంకర్ భార్యాపిల్లలో నివసిస్తున్నాడు. ఆయన కుమార్తె సించన రెండో కాన్పు కోసం ఇంటికి వచ్చింది. ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు తొమ్మిది నెలలు వచ్చాయి. దీంతో కూతుర్ని అత్తారింటికి వెళ్లాలని తండ్రి చెప్పాడు. కానీ ఆమె వెళ్లటానికి ఇష్టపడలేదు. ఇరుగు పొరుగు వారు కూడా మీ అమ్మాయిని అత్తారింటికి ఎప్పుడు పంపిస్తారు అని అడుగుతుండేవారు. దీంతో శంకర్ కూతురితో ‘అత్తారింటికి వెళ్లాలి కదమ్మా’ అంటూ పదే పదే చెప్పేవాడు. దీంతో కూతురు సించనకు కోపం వచ్చింది. వెళ్లనంటే పదే పదే ఎందుకు వెళ్లమని చెబుతున్నావు అనేది. దీంతో శంకర్ కుటుంబంలో గొడవలు చెలరేగాయి. ఇంట్లోని ఎవరూ తన మాటను వినడం లేదని మనస్తాపం చెందిన శంకర్ గత ఆదివారం (సెప్టెంబర్12,2021) బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు.

అలా వెళ్లిన శంకర్ శుక్రవారం అంటే 17 తేదీ రాత్రి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చేసరికి తలుపులు వేసేసి ఉన్నాయి. ఇంట్లో ఎటువంటి అలికిడి లేదు. దీంతో శంకర్ మనస్సు కీడును శంకించింది. దీంతో భయపడుతునే అనుమానంతో కిటీకి నుంచి చూసిన ఆయన గుండె ఆగినంత పనైంది. భార్య భారతి (50), కుమార్తెలు సించన, సింధురాణి (30), కొడుకు మధుసాగర (27) ఉరేసుకుని కనిపించారు. దీంతో శంకర్ పెద్ద పెద్ద కేకలు వేయగా ఇరుగు పొరుగువారు వచ్చి చూడగా జరిగిన ఘోరం అర్థమై షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.

Read more : AP : ఒకే కుటుంబంలో న‌లుగురు ఆత్మ‌హ‌త్య‌

తలుపులు పగుల గొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా..వీరి మరణం తర్వాత ఒంటరైన సించన తొమ్మిది నెలల కుమారుడు ఆకలికి తాళలేక ఏడ్చి ఏడ్చి చనిపోయాడు. సించన మూడేళ్ల కుమార్తె ప్రేక్ష స్పృహ కోల్పోయి అచేతనంగా పడి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.శంకర్ అలిగి వెళ్లిపోయిన తరువాతే వీరంతా ఆత్మహత్య చేసుకన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఐదు రోజుల క్రితమే వీరంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

Read more : రాజస్థాన్ లోని ఒకే ఇంటిలో 11మంది పాకిస్థానీలు ఆత్మహత్య..!!

ఈ ఘటనపై బెంగళూరు పశ్చిమ సీపీ సంజీవ్ ఎం పాటిల్ మాట్లాడుతు..తొమ్మిది నెలల పసిబిడ్డ చనిపోయి మంచం మీద చని ఉందని మరో మూడేళ్ల చిన్నారి సొమ్మసిల్లి పడి ఉండటంతో వెంటనే హాస్పిటల్ కు తరలించామని తెలిపారు. నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించామని..వీరి ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.