బెంగళూరు మరో బ్రెజిల్ అయిపోతుంది: కుమార్ స్వామీ

  • Published By: Subhan ,Published On : June 23, 2020 / 11:23 AM IST
బెంగళూరు మరో బ్రెజిల్ అయిపోతుంది: కుమార్ స్వామీ

రాష్ట్ర ప్రభుత్వం మరో 20రోజులు లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జనతా దళ్ (సెక్యులర్) లీడర్ హెచ్‌డీ కుమార్ స్వామీ మంగళవారం అన్నారు. ఇండియాలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాతే కరోనా వైరస్ కేసులు పెరిగిపోయాయని అన్నారు. కర్ణాటకలోనూ వెంటనే షట్ డౌన్ ప్రకటించాల్సిందేనని అన్నారు. 

ప్రత్యేకించి బెంగళూరులో ప్రకటించాలి. బెంగళూరు మరో బ్రెజిల్ లా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుమారస్వామి చేసిన వరుస ట్వీట్లతో ఇండియాలో కరోనా వ్యాప్తి వేగంగా మారిందని అన్నారు. ‘మానవ జీవితాలతో ఆడుకోవడం ఆపేయండి. కొద్ది ప్రాంతాలనే సీల్ చేసి సేవలను అందించకూడదు. బెంగళూరు ప్రాణాలపై నిజంగా అంత జాగ్రత్త ఉంటే వెంటనే షట్ డౌన్ ప్రకటించి 20రోజులు కంటిన్యూ చేయండి’ అన్నారు. 

లేదంటే బెంగళూరును మరో బ్రెజిల్ గా మారిపోతుంది. ఎకానమీ కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం. అత్యధిక కొవిడ్ కేసులు ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. జనాభా ఉన్న దేశాల్లో ఇండియాలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. 

మహమ్మారి కారణంగా బాధపడుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత ఇండియా నాలుగో స్థానంలో ఉంది. దేశం మొత్తంలో 4.4 లక్షల కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. 14వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 

ప్రధానమంత్రిని ఒక్కటే అడుగుతున్నాను. కంటైన్మెంట్ జోన్లలో అవసరాన్ని బట్టి లాక్ డౌన్ విధించి మహమ్మారిని కట్టడి చేయాలి. మరో 20రోజులు నేషనల్ లాక్ డౌన్ విధించడం మంచిది. ఆర్థిక భారాన్ని మా మీద వేయకండి’ అని కుమారస్వామి అన్నారు.