Publish Date - 12:54 am, Thu, 8 April 21
Bengaluru Woman Orders Wine Online, Loses RS 1 6 Lakh : ఆన్ లైన్ లో కొనేయటం మొదలయ్యాక ఏదైనా ఆర్డర్ చేయటానికీ వెనుకడటంలేదు. వేరుశనపప్పు నుంచి వైన్ బాటిళ్ల దాకా ఏదైనా ఆర్డర్ చేస్తే చాలు ముంగిట్లోకొచ్చి పడిపోతున్నాయి. దీంతో బీరు బాటిళ్లే కాదు వైన్ బాటిల్స్ కూడా ఆర్డ్ చేసేస్తున్నారు. అచ్చం అలాగే బెంగళూరుకు చెందిన 25 ఏళ్ల మహిళ గూగుల్‌లో సెర్చి చేసి వైన్ బాటిల్ ఆర్డర్ చేసింది.
చేసిన వైన్ బాటిల్ రావటం ఎలాగున్నాగానీ..ఆమె బ్యాంక్ ఎకౌంట్ నుంచి ఏకంగా రూ.1.6 లక్షలు మాయం అయ్యాయి. దీంతో ఆమె లబోదిబోమంది. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకుని వైన్ బాటిలు రాక డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇది బైటపడింది. దీనిపై కేసు నమోదు చేసుకుని ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వైట్‌ఫీల్డ్‌లో నివసిస్తున్న ఆంచల్ ఖండేల్వాల్ అనే మహిళ మార్చి 24,2021న ఆన్లైన్లో వైన్‌ను విక్రయించి హోం డెలివరీ చేసేవాళ్లు ఎవరున్నారా? అని గూగుల్‌లో సెర్చ్ చేసింది. అలా ఆమెకు రణవీర్ సింగ్ అనే వ్యక్తి ఫోన్ నంబర్ దొరికింది. ఆ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి..విషయం చెప్పింది.దానికి రణ్వీర్ సింగ్ మీరు కోరుకున్న వైన్ నా దగ్గర ఉంది. మీరు ఏ టైమ్ కు పంపించమంటే ఆ టైమ్ కు మీకు అందేలా చేస్తాననీ..ఆన్లైన్లో అడ్వాన్స్ చెల్లిస్తే నేరుగా ఆమె ఫ్లాట్‌కి వైన్ బాటిల్‌ను డెలివరీ చేస్తామని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆంచల్
రణవీర్ సింగ్ పంపించిన క్యూఆర్ స్కాన్ కోడ్‌ను ఉపయోగించి ఆన్ లైన్ లో డబ్బులు పంపించింది. కానీ నాకు మీనుంచి డబ్బులు రాలేదని రణవీర్ చెప్పాడు. దాంతో ఆమె మరోసారి సెండ్ చేసింది. అయినాగానీ డబ్బులు రాలేదని చెప్పటంతో ఆమె మరికొన్ని లావాదేవీలు చేసేలా చేశాడు.
అలా మొత్తం ఐదు లావాదేవీలు చేయడంతో ఆమె రూ.1,59,595ను పోగొట్టుకుంది. అలా తను ఆర్డర్ చేసిన వైన్ కోసం వెయిట్ చేసింది. వారం గడిచినా వైన్ రాకపోవటంతో ఆంచల్ రణవీర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో తాను మోసపోయనని గ్రహించిన ఆమె పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన తరువాత ఆమె 100 డయల్ చేసి పిర్యాదు చేసి ఉంటే నిందితుల బ్యాంక్ ఖాతాను నిలిపివేసేవారమని ఆమె ఫిర్యాదు చేయడంలో ఆంచల్ బాగా లేట్ చేశారని పోలీసులు తెలిపారు.