Bengaluru Woman : భర్త ఆ పని చేస్తున్నాడని తెలుసుకున్న భార్య..విడాకులకు అప్లై

Bengaluru Woman : భర్త ఆ పని చేస్తున్నాడని తెలుసుకున్న భార్య..విడాకులకు అప్లై

Bengaluru Woman

Husband Turns Escort : కరోనా కారణంగా..ఎన్నో రంగాలు అతాకుతలమయి పోయాయి. ఎంతో మంది జీవితాలపై పెను ప్రభావం చూపెట్టింది. కొంతమంది ఉద్యోగాలు కోల్పోయి..తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయారు. దీంతో ఇతర పనులు చేసుకుంటూ..జీవనం సాగిస్తున్నారు. ఇలాగే ఉద్యోగం పోయి…సెక్స్ వర్కర్ గా మారిన ఓ యువకుడి ఉదంతం బెంగళూరులో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న భార్య..విడాకులు కోరుతోంది.

2017 సంవత్సరంలో బీపీఓలో 27 సంవత్సరాలున్న ఓ యువకుడు పనిచేస్తున్నాడు. క్యాంటిన్ లో కలిసిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు. అనంతరం 2019లో వివాహం చేసుకున్నారు. అయితే..కరోనా కారణంగా..అతని ఉద్యోగం పోయింది. ఇతర ఉద్యోగాల కోసం అన్వేషించాడు. ఈ క్రమంలో..భర్త ఎప్పుడు ల్యాప్ టాప్, సెల్ ఫోన్ లతో బిజీగా ఉండడం భార్య గమనించింది. దీంతో ఏదో ఉందని అర్థం చేసుకున్న భార్య నిఘా పెట్టింది.

ల్యాప్ టాప్ తెరిచి చూద్దామని ప్రయత్నించింది. కానీ..అందులో ఉన్న విషయాలు తెలియలేదు. దీంతో ఇంజనీర్ అయిన..తన సోదరుడి సాయం కోరింది. అందులో భర్త నగ్న చిత్రాలు, పలువురు మహిళల అర్థనగ్న చిత్రాలు చూసి షాక్ తిన్నది. భర్త రహస్యంగా సెక్క్ వర్కర్ గా పనిచేస్తున్నాడని తెలుసుకుంది. ఇదే విషయాన్ని భర్తను నిలదీసింది. గ్రాఫిక్ ఫొటోలను భర్త బుకాయించింది. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ లోని మహిళా హెల్ప్ లైన్ ను ఆశ్రయించింది. తాను ఉద్యోగం కోల్పోవడంతో కమర్షియల్ సెక్స్ వర్కర్ గా మారినట్లు తెలిపాడు. దంపతుల మధ్య సఖ్యత కుదిర్చేందుకు తాము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని కౌన్సిలింగ్ నిర్వహించిన వారు వెల్లడించారు.