మాజీ కేంద్రమంత్రి బేణీప్రసాద్ వర్మ కన్నుమూత

  • Published By: venkaiahnaidu ,Published On : March 27, 2020 / 04:13 PM IST
మాజీ కేంద్రమంత్రి బేణీప్రసాద్ వర్మ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి బేణీప్రసాద్ వర్మ (79) కన్నుమూశారు. సమాజ్‌ వాదీ పార్టీ (SP) వ్యవస్థాపక సభ్యుడైన బేణీప్రసాద్ వర్మ ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగేవారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బేణీప్రసాద్…లక్నోలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.

1996-98 మధ్య అప్పటి ప్రధాని హెడ్‌డీ దేవెగౌడ కేబినెట్‌లో టెలికం మంత్రిగా బేణీప్రసాద్ పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో 2011లో ఉక్కుశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బేణీప్రసాద్ వర్మకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హాస్పిటల్ కు వెళ్లి నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్ లోని కైసర్ గంజ్ నియోజకవర్గం నుంచి బేణీ ప్రసాద్ పలు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2009లో బేణీప్రసాద్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే 2016లో ఆయన తిరిగి సమాజ్ వాదీ పార్టీలో చేరారు.