BEST : ఆర్టీసీ ఉద్యోగులకు చిల్లర రూపంలో జీతాలు

ఆర్టీసీ ఉద్యోగులకు చిల్లర రూపంలో జీతాలు ఇస్తుండడం చర్చనీయాంశమైంది. కరెన్సీ నోట్ల వినియోగంమే జోరుగా సాగుతున్న క్రమంలో..ఉన్నతాధికారులు ఈ విధంగా చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

BEST : ఆర్టీసీ ఉద్యోగులకు చిల్లర రూపంలో జీతాలు

RTC

Salaries in Coins : ఆర్టీసీ ఉద్యోగులకు చిల్లర రూపంలో జీతాలు ఇస్తుండడం చర్చనీయాంశమైంది. కరెన్సీ నోట్ల వినియోగంమే జోరుగా సాగుతున్న క్రమంలో..ఉన్నతాధికారులు ఈ విధంగా చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకుముందున్న 10, 20, 25 నాణేలు ఇప్పుడు కనిపించకుండా పోయాయి. కొత్త కొత్త నాణెలను అందుబాటులోకి తెస్తోంది. నాణేల ఉపయోగం గణనీయంగా తగ్గిపోతుండగా..మహారాష్ట్రలో ఆర్టీసీ ఉద్యోగులకు చిల్లర రూపంలో జీతాలు ఇస్తున్నారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ అండ్ ట్రాన్స్ పోర్టు (బెస్ట్) బస్సుల్లో టికెట్ల విక్రయం ద్వారా..ప్రతి రోజు డిపోకు లక్షల్లో చిల్లర నాణేలు వచ్చి పడుతున్నాయి. దాదాపు రూ. 12 కోట్లకు పైగానే ఈ నాణేలను సంస్థ ప్రధాన కార్యాలయమైన కొలాబాలోని బస్ భవన్ లో భద్ర పరిచారు.

వీటిని ఏం చేయాలో అర్థం కావడం లేదు ఉన్నతాధికారులకు. బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని భావించినా…అంత చిల్లర తీసుకుని లెక్క పెట్టుకోవాలా ? అంటూ బ్యాంకు సిబ్బంది నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో చిల్లర నాణేలను ఉద్యోగులకు జీతాలుగా ఇవ్వాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో రూ. 15 వేలను చిల్లర నాణేలుగా..మిగతా జీతాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు సంచులతో డిపోలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బృహాన్ ముంబై ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్ ఆధ్వర్యంలో నడిచే బస్సుల్లో మొదటి 5 కిలోమీటర్ల దూరానికి కనీస బస్సు చార్జీ రూ.5గా ఉంది. వరుసగా టికెట్ ధరలు రూ. 10, రూ. 15 ఇలా చార్జీలు వున్నాయి. సంస్థ పరిధిలో దాదాపు 40 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వేతనాల్లో కొంత చిల్లర రూపంలో చేతికి, మరికొంత బ్యాంకుల్లో వేయాలని సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.