ఫిబ్రవరి 26న భారత్ బంద్.. పెట్రో ధరలు, జీఎస్టీ, ఈ-వే బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన

ఫిబ్రవరి 26న భారత్ బంద్.. పెట్రో ధరలు, జీఎస్టీ, ఈ-వే బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన

Bharat Bandh on 26 February: ట్రేడ్ యూనియన్లు భారత్‌ బంద్‌కు రెడీ అయ్యాయి. ఫిబ్రవరి 26న భారత్ బంద్ నిర్వహించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ-CAIT) పిలుపునిచ్చింది. దానికి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతోపాటు అఖిల భారత వాహనదారుల సంక్షేమ సంఘం (ఆలిండియా ట్రాన్స్‌పోర్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌-ఏఐటీడబ్ల్యూఏ-AITWA) కూడా సంపూర్ణ మద్దతు పలికింది. అన్ని రాష్ట్ర స్థాయి ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్లు బంద్‌కు మద్దతిస్తాయని ఏఐటీడబ్ల్యూఏ అధ్యక్షుడు మహేంద్ర ఆర్య తెలిపారు. 26న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రహదారులు దిగ్బంధం చేస్తామన్నారు.

ఇంధన ధరలు, జీఎస్టీ, ఈ-వే బిల్లులకు వ్యతిరేకంగా:
పెరుగుతున్న ఇంధన ధరలు, జీఎస్టీ, ఈ-వే బిల్లులను వ్యతిరేకిస్తూ.. ఒకరోజు భారత్ బంద్‌కు వెళ్తున్నారు. జీఎస్టీ విధానాన్ని సమీక్షించాలని, కొత్త ఈ-వే బిల్లు విధానం, కొన్ని నిబంధనలను రద్దు చేయాలని, దేశమంతా డీజిల్ ధరలు ఒకేలా ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

Bharat Bandh on 26 February 2021: Over 8 Crore Traders to Protest Against GST, Fuel Price Hike and E-Way Bill

జీఎస్టీ విధానాలపై ఆందోళన:
ఇక, ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాసింది సీఏఐటీ. జీఎస్టీ విధానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ-టెయిలర్స్.. ఈ-కామర్స్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లింది. జీఎస్టీ విధానాన్ని సమీక్షించి, సర్కార్‌కు కొత్త సిఫారసులు చేసే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. భారత్‌ బంద్‌కు దేశంలోని దాదాపు 40 వేల కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని సమాచారం. బంద్‌లో దాదాపు 8 కోట్ల మంది వ్యాపారులు పాల్గొననున్నారు.

Centre extends validity of expired e-way bills, GST audit deadline

జీఎస్టీ విధానాన్ని సమీక్షించాలని, కొత్త ఈ-వే బిల్లు విధానం, కొన్ని నిబంధనలను రద్దు చేయాలని, దేశంలో డీజిల్ ధరలు ఒకేలా ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ట్రాన్స్ పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ బంద్ కు మద్దతిచ్చింది.

ఓవైపు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగిస్తుండగా, ఇప్పుడు ట్రేడ్ యూనియన్లు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. అన్ని వైపుల నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోంది.