ఇంకా పెండింగ్‌లోనే భారత్‌ బయోటెక్‌ కోవాక్సిన్‌ కు అనుమతులు

ఇంకా పెండింగ్‌లోనే భారత్‌ బయోటెక్‌ కోవాక్సిన్‌ కు అనుమతులు

Bharat Biotech Covaxin approvals pending : భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌కు అనుమతులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి‌. కరోనా టీకా అత్యవసర వినియోగంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన డీసీజీఐ.. ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి సీరం, భారత్‌ బయోటెక్‌ కంపెనీలు అత్యవసర వినియోగం కోసం దరఖాస్తులు చేసుకున్నాయి‌. అయితే, సీరం ఇన్స్‌స్టిట్యూట్‌ రూపొందించిన కోవిషీల్డ్‌కు డీజీసీఐ కమిటీ అనుమతి ఇచ్చింది. దానితో పాటు భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు చేసుకున్న కోవాక్సిన్‌కు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

కోవాక్సిన్‌కు అనమతులు ఇవ్వాలంటే మరికొంత డేటా కావాలని భారత్‌ బయోటెక్‌ను కోరింది డీజీసీఐ. సీరం, భారత్‌ బయోటెక్‌ గత నెలలో అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటి అనుమతులపై నిపుణులు గత నెలలో మూడుసార్లు సమావేశమైయ్యారు. ఈ వారం మొదట్లో రెండు సంస్థల నుంచి మరింత డేటాను నిపుణులు కోరారు. భారత్‌ బయోటెక్ అందించకపోవడంతోనే కోవాక్సిన్‌కు అనుమతులు లభించలేదు. దీంతో కోవాక్సిన్‌కు అనుమతులు రావాలంటే మరికొంత సమయం ఆగాల్సి వచ్చింది.

భారతీయులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ అందింది. కరోనా మహమ్మారికి అంతం పలికే వ్యాక్సిన్‌కు కేంద్ర నిపుణుల కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆక్స్‌ఫర్ట్‌- ఆస్ట్రాజెనెకా సహకారంతో సీరం సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సీరం వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి ఆమోదించాలంటూ నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండ్రోజుల్లోనే DCGI నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిపుణుల కమిటీ సూచనల మేరకు వ్యాక్సిన్‌కు DCGI కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.