భారత్‌ బయోటెక్‌ గుడ్‌న్యూస్‌…దేశవ్యాప్తంగా 13వేల మంది వాలంటీర్లకు కోవాగ్జిన్‌ టీకా

భారత్‌ బయోటెక్‌ గుడ్‌న్యూస్‌…దేశవ్యాప్తంగా 13వేల మంది వాలంటీర్లకు కోవాగ్జిన్‌ టీకా

Bharat Biotech covaxin vaccine for 13 thousand volunteers : కరోనా వైరస్‌కు విరుగుడు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాక్సిన్‌ మూడో విడత క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 13వేల మంది వాలంటీర్లకు కొవాగ్జిన్‌ టీకా ఇచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 26వేల మంది వాలంటిర్లకు టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా అందులో సగం మేర సాధించడంపై కంపెనీ హర్షం వ్యక్తం చేసింది. కొవిడ్‌-19 మహమ్మారికి సురక్షితమైన, సమర్థవంతమైన స్వదేశీ వ్యాక్సిన్‌ను తీసుకురావడానికి సహకరించిన వలంటీర్లకు భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా కృతజ్ఞతలు తెలిపారు.

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేస్తోంది. నవంబర్‌ మధ్యలో మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. మన దేశంలో ఇంత విస్తృత స్థాయిలో మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన తొలి వ్యాక్సిన్‌ ఇదే. మొదటి, రెండో దశలో వేయిమందిపైనే క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. ఇందులో ఇమ్యునిటీ వృద్ధి మరియు భద్రత విషయంలో ప్రోత్సాహకర ఫలితాలు వచ్చాయి. మొదటి, రెండో విడత ట్రయల్స్‌ వ్యాక్సిన్‌ మెరుగైన ఫలితాలు చూపడంతో డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్ ఇండియా మూడో విడత ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగానే.. టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు భారత్ బయోటెక్ దరఖాస్తు చేసింది. దీంతోపాటు ఫైజర్, ఆక్స్‌ఫర్డ్ సంస్థలు కూడా దరఖాస్తు చేశాయి. వీటిపై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్‌లోని బయోసేప్టీలెవల్‌-3 బయో కంటైన్మెంట్‌ జోన్‌లో భారత్‌ బయోటెక్ దీన్ని తయారు చేస్తోంది. అద్భుతమైన సేఫ్టీ ట్రాక్‌ రికార్డు కలిగి, 30కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేసిన వీరో సెల్‌ఫ్లాట్‌ఫామ్‌పై ఈ వ్యాక్సిన్‌ తయారవుతోంది. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంటనే వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా సరఫరా చేయడానికి భారత్‌ బయోటెక్‌ ఏర్పాట్లు చేసుకుంటోంది.