Bharat Biotech : భారత్ బయోటెక్‌ బూస్టర్ డోస్ ట్రయల్స్‌కు DCGI అనుమతి.. ముక్కు ద్వారా వేసే టీకా..!

ప్రముఖ దేశీయ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్‌కు డ్రగ్స్ కంట్రోలర్ శాఖ (DGCI) డీసీజీఐ.. ఇంట్రానాసల్ కోవిడ్ బూస్టర్ డోసు ట్రయల్స్ కు సంబంధించి అనుమతినిచ్చింది.

Bharat Biotech : భారత్ బయోటెక్‌ బూస్టర్ డోస్ ట్రయల్స్‌కు DCGI అనుమతి.. ముక్కు ద్వారా వేసే టీకా..!

Bharat Biotech Dcgi Gives A

Bharat Biotech : ప్రముఖ దేశీయ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్‌కు డ్రగ్స్ కంట్రోలర్ శాఖ (DGCI) డీసీజీఐ.. ఇంట్రానాసల్ కోవిడ్ బూస్టర్ డోసు ట్రయల్స్ కు సంబంధించి అనుమతినిచ్చింది. ప్రస్తుత కోవిడ్ వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే బూస్టర్ డోసుల అవసరం ఎంతైనా ఉందని పరిశోధకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థకు బూస్టర్ డోసు ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతించడంతో మరో ముందడుగు పడింది.

బూస్టర్ డోసు ట్రయల్స్ నిర్వాహణకు సంబంధించి ఇంట్రానాసల్ బూస్టర్ టీకాపై సుమారు 900 సబ్లెక్ట్స్‌పై ట్రయల్స్ నిర్వహించేందుకు బయోటెక్ కంపెనీ ప్లాన్ చేస్తోంది. బూస్టర్ డోసు మూడో దశపై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే DCGI నిపుణుల కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు సమర్థవంతమైనవే అయినప్పటికీ.. పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లను ఎంతవరకు తట్టుకోగలవనే అనుమానాలకు తావిస్తోంది. అందుకే వేరియంట్లు ఎన్ని వచ్చినా తట్టుకునేలా బూస్టర్ డోసు తీసుకురానుంది.

నాసిక రంధ్రం ద్వారా ఎక్కించే టీకా ఇది :
ఈ ఇంట్రానాసల్ కోవిడ్ డ్రగ్ బూస్టర్ డోసుగా లిక్విడ్ రూపంలో ఉంటుంది. అయితే మిగతా వ్యాక్సిన్ల మాదిరిగా ఇంజెక్ట్ చేసేది కాదు.. నాసిక రంధ్రం ద్వారా ఎక్కిస్తారు. ఈ ట్రయల్స్ నిర్వహణకు సంబంధించి ప్రోటోకాల్ సమర్పించాల్సిందిగా మూడు వారాల క్రితమే డీసీజీఐ నిపుణుల కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ముక్కు ద్వారా అందించే కోవిడ్ టీకాలను భారతదేశంలో మొదటిసారిగా భారత్ బయోటెక్ సంస్థ రూపొందించింది. మూడో డోసు టీకా కోసం మూడో దశ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసింది. అందులో భారత్ బయోటెక్ రెండోది కూడా. ఇతర కొవిడ్ వ్యాక్సిన్ల మాదిరిగా కాకుండా నొప్పి లేని టీకాలను ముక్కు ద్వారా ఇవ్వవచ్చు. ఈ రకం టీకాలతోనూ అన్ని రకాల కరోనా వేరియంట్లను నియంత్రించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.

దేశంలో ఒకవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది.. మరోవైపు.. కరోనా వాక్సిన్లను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసేందుకు టీకా తయారీ సంస్థలు సన్నాహాలు ప్రారంభించాయి. భారత్‌లో తయారయ్యే కోవాక్జిన్, కోవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసుకునేందుకు అనుమతి కోసం తయారీ కంపెనీలు ఇప్పటికే భారత డ్రగ్ నియంత్రణ సంస్థ DCGI అనుమతి కోరాయి. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ ఎంత ఉండాలన్న అంశంపై నివేదిక ఇవ్వాలని DCGI.. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA)ను కోరింది.

ఏయే వ్యాక్సిన్ ధర ఎంత ఉండొచ్చుంటే? :
ఇప్పటికే.. కోవిషీల్డ్ వ్యాక్సిన్.. భారత మార్కెట్ లో రెగ్యులర్‌గా అమ్ముకునేందుకు అనుమతులు ఇవ్వాలని పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII) ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత అత్యధికంగా వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లలో కోవి షీల్డ్ ఒకటిగా చెప్పవచ్చు. భారత్ సహా ఇతర దేశాలకు 100 కోట్లు కోవిషీల్డ్ డోసులను పంపిణీ చేయడాన్ని దరఖాస్తులో పేర్కొంది.

ప్రస్తుతం కొవిషీల్డ్‌ అత్యవసర వినియోగానికి భారత్‌లో అనుమతి ఉంది. రెగ్యులర్‌ మార్కెటింగ్‌లో అమ్ముకోటానికి ప్రభుత్వం అనుమతిస్తే.. ప్రపంచంలో ఆమోదం పొందిన రెండో వ్యాక్సిన్‌ కానుంది. కోవిడ్-19 వ్యాక్సిన్‌లు కోవిషీల్డ్, కోవాక్సిన్‌లకు DCGI రెగ్యులర్ మార్కెట్ ఆమోదం మంజూరు చేసిందని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. కొన్ని షరతులతో అందించేందుకు అనుమతించినట్టు మాండవియా తెలిపారు.

ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు కోవాక్జిన్, కోవిషీల్డ్ టీకాలు బహిరంగ మార్కెట్లో ధరలు రూ.275 ఒక్క డోసుకి ఉంటుందని అంచనా. టీకా ధర రూ.275 ఉండగా.. సేవా రుసుము కింద మరో రూ.150లను అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు 75 శాతం ప్రభుత్వం 25 శాతం ప్రైవేట్ పద్దతిలో కరోనా టీకాలు అందిస్తున్నారు. ఒక డోస్ కోవాక్సిన్ ధర రూ. 1,200 ఉండగా.. కోవిషీల్డ్ ధర రూ. 780గా అందుబాటులో ఉంది.

Read Also : Corona Control : తెలంగాణలో కరోనా కట్టడికి కొత్త వ్యూహాలు.. లక్షణాలున్న ప్రతి ఒక్కరికి కోవిడ్ కిట్ పంపిణీ