Covaxin Booster Vaccine : ఒమిక్రాన్‌పై కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు 90శాతం ప్రభావం

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు పనితీరును పరీక్షించేందుకు అమెరికాలోని ఆక్యూజెన్‌ సహకారంతో అక్కడి ఎమోరీ వ్యాక్సిన్‌ సెంటర్‌లో భారత్‌ బయోటెక్‌ పరిశోధన చేపట్టింది.

Covaxin Booster Vaccine : ఒమిక్రాన్‌పై కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు 90శాతం ప్రభావం

Covaxin

covaxin booster vaccine working on Omicron : ఒమిక్రాన్‌పై కొవాగ్జిన్‌ బూస్టర్‌ టీకా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. డెల్టాతో పాటు ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు బూస్టర్‌ డోసుతో గణనీయంగా ఉత్పత్తి అవుతున్నాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌పై 100శాతం సామర్థ్యం చూపించగా.. ఒమిక్రాన్‌పై 90శాతం ప్రభావశీలత చూపించినట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు పనితీరును పరీక్షించేందుకు అమెరికాలోని ఆక్యూజెన్‌ సహకారంతో అక్కడి ఎమోరీ వ్యాక్సిన్‌ సెంటర్‌లో భారత్‌ బయోటెక్‌ పరిశోధన చేపట్టింది. ఇందులో భాగంగా కొవాగ్జిన్‌ బూస్టర్‌ తీసుకున్న వారి రక్తాన్ని ఒమిక్రాన్‌ సోకిన వారి రక్త నమూనాలతో పరిశోధకులు పోల్చి చూశారు. కొవాగ్జిన్‌ రెండో డోసు తీసుకున్న 6 నెలలు పూర్తైన వారికి బూస్టర్‌ డోసు ఇచ్చి పరీక్షించారు. 90శాతం మందిలో ఒమిక్రాన్‌ను తటస్థీకరించే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు.

CJI Justice NV Ramana : వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

మూడో డోసు తర్వాత ఒకే వర్గానికి చెందిన వైరస్‌లతో పాటు భిన్న వేరియంట్లను తటస్థీకరించే యాంటీబాడీల స్థాయిలు 19 నుంచి 265 రెట్లు పెరిగినట్లు కనుగొన్నారు. అంతేకాకుండా ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసులు ఒమిక్రాన్‌పై చూపించిన సమర్థతతో కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు ఫలితాలను పోల్చవచ్చని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.