ఫిబ్రవరి,2021 నాటికి కోవిడ్ వ్యాక్సిన్ రెడీ : ICMR

  • Edited By: murthy , November 5, 2020 / 03:59 PM IST
ఫిబ్రవరి,2021 నాటికి కోవిడ్ వ్యాక్సిన్ రెడీ : ICMR

bharat biotech vaccine could launch by february : భారత్ బయోటెక్ సంస్ధ రూపోందిస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త రజనికాంత్ తెలిపారు.  భారత ప్రభుత్వం సహకారంతో భారత్ బయెటెక్ సంస్ధ… కోవిడ్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను రూపోందిస్తున్న సంగతి తెలిసిందే.

కొవాగ్జిన్ తుది ద‌శ ట్ర‌య‌ల్స్ ఈ నెల‌లోనే ప్రారంభం అయ్యాయ‌ని, అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అందిన సమాచారం మేరకు… వ్యాక్సిన్ సుర‌క్షితంగా, ప్ర‌భావ వంతంగా ఉన్న‌ట్లు తెలిసిందని ర‌జ‌ని కాంత్ తెలిపారు. భార‌త్ బ‌యోటెక్‌, ఐసీఎంఆర్ ఆధ్వ‌ర్యంలో కొవాగ్జిన్ కోసం ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. తొలుత ఈ వ్యాక్సిన్‌ను వ‌చ్చే ఏడాది రెండ‌వ క్వార్ట‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు.కానీ ఫిబ్ర‌వ‌రి నెలాఖరు, మార్చి మొదటివారంలోనే వ్యాక్సిన్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ర‌జ‌ని కాంత్ తెలిపారు. దీనిపై భార‌త్ బ‌యోటెక్ సంస్థ ఇంకా స్పందించ‌లేదు. ఐసీఎంఆర్ రీస‌ర్చ్ మేనేజ్మెంట్‌లో ర‌జ‌ని కాంత్ హెడ్‌గా ఉన్నారు.