భారత్ బయోటెక్ అసంపూర్ణ ట్రయల్ డేటాపై AIDAN అభ్యంతరం.. టీకా అనుమతిపై ప్రశ్నల వర్షం

భారత్ బయోటెక్ అసంపూర్ణ ట్రయల్ డేటాపై AIDAN అభ్యంతరం.. టీకా అనుమతిపై ప్రశ్నల వర్షం

Bharat Biotech’s incomplete trial data raises questions : భారత్ బయోటెక్ అసంపూర్ణ ట్రయల్ డేటాపై అనేక ప్రశ్నలను తావిస్తోంది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ కు నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. హెల్త్ సెక్టార్ లోని స్వతంత్ర నెట్‌వర్క్ ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ (AIDAN) స్వచ్ఛంద సంస్థ .. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్ మోడ్‌లో ఉండగానే అత్యవసర వినియోగ అనుమతి సిఫారసు చేయడం షాకింగ్ గా ఉందని అభిప్రాయపడింది. ఇంకా వ్యాక్సిన్ సమర్థత రేటును విశ్లేషించకుండానే ఎలా అనుమతినిస్తారనే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో SEC సిఫారసులను పున: పరిశీలించాల్సిందిగా DCGIని కోరుతున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. కోవాక్సిన్‌కు REU అనుమతి ఇవ్వడాన్ని ప్రశ్నించింది.

మొదటి మోతాదు తర్వాత 24,000 మంది వాలంటీర్లకు చెందిన ఇమ్యునోజెనిసిటీ డేటా, రెండవ మోతాదు తర్వాత 10,000 మంది వాలంటీర్లకు చెందిన డేటాను మూడో దశ ట్రయల్ గురించి భారత్ బయోటెక్ ఇంకా పూర్తి విశ్లేషణ చేయలేదు. ఫేజ్ 3 ట్రయల్స్ కోసం నవంబర్ 16న మాత్రమే వాలంటీర్లను నియమించడం ప్రారంభించింది. డిసెంబర్ 22న, 26,000 మంది వాలంటీర్లలో సగం మందిని మాత్రమే నియమించింది. టీకా 28 రోజుల వ్యవధిలో రెండు షాట్లలో ఇవ్వాల్సిన ఉంది. నవంబర్ 16 ప్రారంభ తేదీని ప్రకటిస్తే.. రెండవ మోతాదు డిసెంబర్ మధ్యలో రెండో డోస్ ఇవ్వాల్సి ఉంటుంది.

భారత్ బయోటెక్ తన ట్రయల్స్ ప్రోటోకాల్‌లో మొదటి షాట్ తర్వాత 42 రోజుల నుంచి వ్యాక్సిన్‌ అంచనా వేయొచ్చు. అంటే డిసెంబర్ 27 రెండో షాట్ వేయొచ్చు. భారత్ బయోటెక్ 23,000 మంది వాలంటీర్లను నియమించినట్టు ప్రకటించింది. భారతదేశంలోని పలు చోట్ల కోవాక్సిన్ ఫేజ్ -3 క్లినికల్ ట్రయల్ కోసం 26,000 మంది పాల్గొంటారని అంచనా వేసింది. కోవాక్సిన్ 3వ దశ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ నవంబర్ మధ్యలో ప్రారంభమయ్యాయి. భారతదేశం అంతటా 26,000 మంది వాలంటీర్లతో లక్ష్యంగా పెట్టుకుంది.