BJP on ‘Bharat Jodo Yatra’: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర పోస్టరులో రాబర్ట్ వాద్రా ఫొటో.. బీజేపీ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర సందర్భంగా తమిళనాడులో ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఫొటో కూడా ఉంది. దీంతో ఈ ఫొటోను షేర్ చేస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన పోస్టర్లకు సంబంధించిన ఫొటోను ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన బీజేపీ జాతీయ ప్రతినిధి షెహ్ జాద్ పూనావాలా... ‘‘కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ జోడో నిజానికి పరివార్ జోడో. భ్రష్టాచార్ జోడో. మీకేమైన సందేహాలు ఉంటే ఈ పోస్టర్ ను చూడండి’’ అని పేర్కొన్నారు.

BJP on ‘Bharat Jodo Yatra’: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర పోస్టరులో రాబర్ట్ వాద్రా ఫొటో.. బీజేపీ తీవ్ర విమర్శలు

BJP on 'Bharat Jodo Yatra'

BJP on ‘Bharat Jodo Yatra’: కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర సందర్భంగా తమిళనాడులో ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఫొటో కూడా ఉంది. దీంతో ఈ ఫొటోను షేర్ చేస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన పోస్టర్లకు సంబంధించిన ఫొటోను ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన బీజేపీ జాతీయ ప్రతినిధి షెహ్ జాద్ పూనావాలా… ‘‘కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ జోడో నిజానికి పరివార్ జోడో. భ్రష్టాచార్ జోడో. మీకేమైన సందేహాలు ఉంటే ఈ పోస్టర్ ను చూడండి’’ అని పేర్కొన్నారు.

మరోవైపు, కాంగ్రెస్ భారత్ జోడో యాత్రపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ… ‘‘ఇది కుటుంబాన్ని కాపాడుకునే ఉద్యమం. అవినీతి కేసులతో ఆ కుటుంబంతో పాటు ఆ పార్టీ రాజకీయ ఉనికిని కోల్పోతోంది. ఇది దేశాన్ని ఏకం చేసే యాత్ర కాదు. రాహుల్ గాంధీని మళ్ళీ తమ నాయకుడిగా చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నం. ఇటువంటి ప్రయత్నాలు ఇంకా ఎన్నిసార్లు చేస్తారు? రాహుల్ గాంధీ కనీసం కాంగ్రెస్ పార్టీని కూడా ఐక్యంగా ఉంచలేకపోతున్నారు. గతంలో దేశ ఐక్యతను బలహీనపర్చేందుకు రాహుల్ గాంధీ పనిచేశారు. పాక్ లో భారత ఆర్మీ చేసిన దాడులకు ఆధారాలు కావాలని అడిగారు’’ అని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.

Woman bites fingers: టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త చేతి మూడు వేళ్ళు కొరికేసిన కోడలు