Bharat Jodo Yatra: ముగింపు దశలో భారత్ జోడో యాత్ర.. రెండవ విడత ప్రియాంకతో కొనసాగించే ప్లాన్‭లో కాంగ్రెస్

కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉన్న ప్రియాంక.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను తన భుజాలకు ఎత్తుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో అనుకున్నంత ప్రభావం చూపలేకపోయారు. భారత్ జోడో యాత్ర పార్టీ వర్గాల్లో మంచి ఊపును ఇవ్వడంతో, ఈ యాత్ర ప్రియాంత చేత కూడా చేపట్టి, వ్యక్తిగతంగా ప్రియాంకకు, పార్టీకి మరింత పేరు తీసుకువచ్చే ప్రణాళికలు సీనియర్ నేతలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Bharat Jodo Yatra: ముగింపు దశలో భారత్ జోడో యాత్ర.. రెండవ విడత ప్రియాంకతో కొనసాగించే ప్లాన్‭లో కాంగ్రెస్

Bharat Jodo Yatra nears end, Congress plans a follow up with Priyanka

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు వచ్చింది. హర్యానా రాష్ట్రంలో కొనసాగుతోన్న ఈ యాత్ర రెండు రోజుల్లో పంజాబ్ రాష్ట్రంలో అడుగుపెట్టనుంది. అనంతరం జమ్మూ కశ్మీర్‭లో సాగిన అనంతరం ఈ యాత్ర ముగుస్తుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరుక సాగుతున్న ఈ యాత్ర అనంతరం, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సాగనున్నట్లు కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం. అయితే ఈ యాత్ర రాహుల్ గాంధీ కాకుండా ప్రియాంక గాంధీ వాద్రా చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Pakistan: జనాభా నియంత్రణకు సరికొత్త విధానం కనుక్కున్న పాక్ మంత్రి.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇదే ప్రణాళికలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాహుల్ యాత్రతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం అయితే కనిపిస్తోంది. ఇదే యాత్రను ప్రియాంకతో చేపడితో మరింత కొత్త ఊపు వస్తుందని, ముఖ్యంగా మహిళలు కాంగ్రెస్ వైపుకు ఎక్కువగా మొగ్గు చూపవచ్చని అంటున్నారు. సోనియా, రాహుల్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక కీలకంగా ఉన్నారు. అయితే సోనియా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అనంతరం, రాహుల్ కీలకంగా మారారు. తాజా యాత్రతో రాహుల్‭పై పార్టీ వర్గాల్లో సైతం విశ్వాసం పెరిగినట్లు తెలుస్తోంది.

CM Manik Saha: బీజేపీ గంగా నది లాంటిది.. ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరి, పాపాల్ని పోగొట్టుకోవాలి: త్రిపుర సీఎం

కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉన్న ప్రియాంక.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను తన భుజాలకు ఎత్తుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో అనుకున్నంత ప్రభావం చూపలేకపోయారు. భారత్ జోడో యాత్ర పార్టీ వర్గాల్లో మంచి ఊపును ఇవ్వడంతో, ఈ యాత్ర ప్రియాంత చేత కూడా చేపట్టి, వ్యక్తిగతంగా ప్రియాంకకు, పార్టీకి మరింత పేరు తీసుకువచ్చే ప్రణాళికలు సీనియర్ నేతలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. కొద్ది రోజుల క్రితమే దారుణంగా ఓడిన గుజరాత్ రాష్ట్రం నుంచి అరుణాల్ వరకు కానీ, బెంగాల్ వరకు కానీ ప్రియాంక పాదయాత్ర చేపట్టే అవకాశం లేకపోలేదు.