Bharath ‘Pralay’ Ballistic Missiles : చైనా,పాక్ సరిహద్దుల్లో భారత్ ‘ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు’ .. వీటి రేంజ్ ఎంతంటే..

ఇక చైనా,పాక్ సరిహద్దుల్లో భారత్ శతృదేశాలకు చుక్కలు చూపించటానికి ‘ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు’ సిద్దంగా ఉన్నాయి.

Bharath ‘Pralay’ Ballistic Missiles :  చైనా,పాక్ సరిహద్దుల్లో భారత్ ‘ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు’ .. వీటి రేంజ్ ఎంతంటే..

Bharath 'Pralay' Ballistic Missiles

Bharath ‘Pralay’ Ballistic Missiles : శతృవుకు శతృవు మిత్రుడు అన్నట్లుగా భారత్ కు ప్రధాన శతృవులుగా మారిన సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలు ఒక్కటయ్యాయి.సరిహద్దుల్లో ఈ రెండు దేశాలు వాటి దుర్భుద్ధిని ఎప్పటికప్పుడు చూపెడుతున్నాయి. చైనా భారత్ భూభాగంలోకి రావటానికి తెగ ఉబలాటపడుతోంది. ఇక పాకిస్థాన్ కుక్క బుద్ధి గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. భారత్ లో నేరుగా ఢీకొనలేక ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో తోక జాడిస్తుంటుంది. అయినా భారత్ సేన మాత్రం ఎప్పటికప్పుడు పాకిస్థాన్ తోక కత్తిరించి చేతిలో పెట్టి పంపుతుంటుంది. అయినా పాక్ కు బుద్ధి అనేది రాదు. ఈక్రమంలో భారత్ పై నేరుగా పోరాడే సత్తా లేక చైనాతో చేతులు కలుపుతోంది. సరిహద్దుల్లో డ్రాగన్ దేశానికి భారత్ సత్తా ఏంటో తెలుసు..అందుకే నేరు యుద్ధం అని చెప్పకుండానే సరిహద్దులు దాటే యత్నాలుచేస్తోంది. వీటికి భారత్ సరైన బదులు చెబుతునే ఉంది. ఇక చైనా ఆటలు సాగనివ్వటంలేదు. దీని కోసం భారత్ ఆయుధాల పరంగా మరింత బలంగా మారుతోంది.

ఇప్పటికే భారత్ అమ్ముల పొదిలో శక్తివంతమైన ఆయుధాలున్నాయి. వీటికి తోడు మరిన్ని శక్తివంతమైన క్షిపణులు వచ్చే చేరనున్నాయి. అవే ‘ప్రళయ్ క్షిపణులు’.చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో భారత్ అత్యాధునిక క్షిపణులను కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. భారత్ సాయుధ బలగాల కోసం 120 ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను కొనుగోలు చేయాలని రక్షణ శాఖ అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయించింది. అత్యాధునిక 120 ప్రళయ్ క్షిపణుల కొనుగోలుకు ఆమోద ముద్ర వేసింది. డీఆర్డీవో (DRDO) సొంతంగా తయారుచేస్తున్న ఈ క్షిపణులు 100 కి.మీ. నుంచి 500 కి.మీటర్ల లక్ష్యాలను ఛేదించగలవని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ క్షిపణులు సరిహద్దుల్లో ఉంటే ఇక భారత్ వైపు చైనా, పాకిస్థాన్ లు చూడాలంటే వెనుకడుగు వేయాల్సిందేననే ధీమా వ్యక్తంచేస్తోంది భారత్ రక్షణశాఖ. ప్రళయ్ క్షిపణులను ఛేధించటం అంత ఈజీ కాదంటున్నాయి రక్షణ వర్గాలు.

2015 లో భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ (Defence Research and Development Organisatio) ప్రళయ్ క్షిపణులను అభివృద్ధి చేసింది. ఈ క్షిపణులు సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా చేయగలవు. అంతేకాదు పేరుకు తగినట్లుగానే ఈ క్షిపణులు ప్రళయాన్ని సృష్టించగలవు. శత్రు దేశాలు ప్రయోగించిన క్షిపణులను కూల్చేసే సామర్థం ఈ ప్రళయ్ క్షిపణులు సొంతం. అవసరాన్నిబట్టి గాలిలోనే దిశను మార్చుకోగలిగే సామర్థ్యం ఈ ప్రళయ్ క్షిపణుల సొంతం. మిస్సైల్ గైడెన్స్ వ్యవస్థతో పాటు అత్యాధునిక సాంకేతికతను జోడించి ఈ ప్రళయ్ క్షిపణులను తయారు చేసింది డీఆర్డీవో. కాగా ఈ ప్రళయ్ క్షిపణులు పరీక్షల్లో చక్కటి ఫలితాలు అందించటంలో ప్రళయ్ క్షిపణులు ఇక యుద్ధానికి సిద్దమయ్యాయి. 2020లోనే ఈ క్షిపణులను పరీక్షించిన భారత్ ఆర్మీ వీటి ఫలితాలపై సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికే చైనా, పాక్ రెండూ కూడా బాలిస్టిక్ మిసైల్ కలిగి ఉండటంతో వారికి తామేమీ తక్కువ కాదంటూ ‘ప్రళయ్’ క్షిపణులు సిద్ధమయ్యాయి. ఇక చైనా, పాక్ లకు సరిహద్దుల్లో చుక్కలు చూపించటానికి భారత్ ఆయుధాలు..‘ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు’ సిద్దంగా ఉన్నాయి.