LOC: ఆయుధాలు పక్కకు పెట్టి స్వీట్లు పంచుకున్న భారత్ , పాక్ సైనికులు

భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సర్వసాధారణం. ఎప్పుడు బాంబుల మోతలు మోగుతూనే ఉంటాయి. అయితే గత కొద్దీ రోజులుగా సరిహద్దు ప్రశాంతంగా ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండటంతో ఇరుదేశాల బలగాలు శాంతియుత వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారు.

LOC: ఆయుధాలు పక్కకు పెట్టి స్వీట్లు పంచుకున్న భారత్ , పాక్ సైనికులు

Loc

LOC: భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సర్వసాధారణం. ఎప్పుడు బాంబుల మోతలు మోగుతూనే ఉంటాయి. అయితే గత కొద్దీ రోజులుగా సరిహద్దు ప్రశాంతంగా ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండటంతో ఇరుదేశాల బలగాలు శాంతియుత వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల సైనికులు గురువారం స్వీట్లు పంచుకున్నారు.

రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం కావడంతో స్వీట్ బాక్సులు ఇచ్చిపుచ్చుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద కుప్వారా, ఊరి సెక్టార్లలో దాయాది దేశాలు స్వీట్లు మార్చుకున్నట్టు సైనిక ప్రతినిధి ఒకరు వెల్లడించారు. భారత్, పాక్ బలగాలు హోలీ, దీపావళి సమయాల్లో కూడా మిఠాయిలు పంచుకుంటారు. గత కొంతకాలంగా సరిహద్దులో ఉద్రికత్త పరిస్థితులు తలెత్తడంతో ఈ పద్దతికి కొంతకాలం స్వస్తి చెప్పారు. తిరిగి గురువారం మిఠాయిలు పంచుకున్నారు.

కుప్వారా సెక్టార్‌లోని టంగ్ధార్‌లో కిషన్‌గంగ నదిపై ఉన్న టిత్వాల్ క్రాసింగ్ వద్ద, ఊరి సెక్టార్‌లోని కమాన్ అమన్ సేతు వద్ద స్వీట్లు ఇచ్చిపుచ్చుకుని, శుభాకాంక్షలు తెలిపేందుకు ఇరు దేశాల సైనికాధికారులు సమావేశం అయ్యారు. సమావేశ వివరాలను ఆర్మీ ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. కాగా కొవిడ్-19 నేపథ్యంలో ఇరువైపులా సైనిక బృందాలు ప్రోటోకాల్‌ను పాటిస్తూ స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నాయి.