BharatPe BMW Bikes : ఈ కంపెనీలో జాబ్ వస్తే BMW బైక్‌లు, Apple ఫోన్లు.. భారత్ పే బంపర్ ఆఫర్

ఫిన్ టెక్ స్టార్టప్ భారత్ పే(BharatPe) బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ కంపెనీలో చేరే ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్ లు ఇస్తామంది.

BharatPe BMW Bikes : ఈ కంపెనీలో జాబ్ వస్తే BMW బైక్‌లు, Apple ఫోన్లు.. భారత్ పే బంపర్ ఆఫర్

Bharatpe Bmw Bikes

BharatPe BMW Bikes : ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీ భారత్ పే(BharatPe) బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ కంపెనీలో ఉద్యోగం పొందే టెకీలకు ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్ లు ఇస్తామంది. ఫినాన్షియల్ ఇయర్-22 కల్లా తన టెక్ టీమ్ ని విస్తృతంగా విస్తరించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తమ కంపెనీలో చేరే టెకీలకు బంపర్ ఆఫర్లు ఇచ్చింది.

మర్చంట్ అండ్ కన్సూమర్ లెండింగ్ స్పేస్ లో ప్రొడక్ట్స్ ను లాంచ్ చేయాలని భారత్ పే చూస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం తమ కంపెనీలో ఉన్న టెక్నాలజీ టీమ్ ని మూడు రెట్లు పెంచాలని నిర్ణయించింది. కొత్తగా మరో 100మంది ఉద్యోగులను నియమించుకుంటామని ఓ ప్రకటనలో భారత్ పే తెలిపింది.

కొత్త టెక్ టీమ్ జాయినీస్ కు ఆప్షన్ ఇచ్చారు. బైక్ ప్యాకేజ్ లేదా గ్యాడ్జెట్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బైక్ ప్యాకేజీలో 5 సూపర్ బైక్ లు ఉంటాయి. అందులో BMW G310R, Jawa Perak, KTM Duke 390, KTM RC 390 and Royal Enfield Himalayan ఉన్నాయి. గ్యాడ్జెట్ ప్యాకేజీలో Apple iPad Pro (with Pencil), Bose Headphone, Harman Kardon Speaker, Samsung Galaxy Watch, WFH desk and chair, and Firefox
Typhoon 27.5 D bicycle ఉన్నాయి.

అంతేకాదు.. తన మొత్తం టీమ్ ని 2021 నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచుల కోసం దుబాయ్ కి తీసుకెళ్తుంది. ప్రత్యక్షంగా మ్యాచులు చేసే అవకాశం కల్పించింది. తమ ఫేవరెట్ టీమ్ ని చీర్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఉద్యోగులను రెఫర్ చేసే వారికి
కూడా ఈ ప్యాకేజీలు వర్తిస్తాయి. భారత్ పే టెక్ తొలి ఫిన్ టెక్. భారత్ లో నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ బ్యాంకింగ్ బిల్డ్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మాకు బెస్ట్ టెక్ టాలెంట్ ఉద్యోగులు అవసరం అని భారత్ పే కో ఫౌండర్, సీఈవో అష్నిర్ గ్రోవర్ తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు నిఖార్సైన టెక్కికల్ టీమ్ ను సిద్ధం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అష్నిర్ చెప్పారు.