RSS కార్యాలయం ఎదుట ధర్నాకు Bhim Army చీఫ్ ఆజాద్‌కు పర్మిషన్

RSS కార్యాలయం ఎదుట ధర్నాకు Bhim Army చీఫ్ ఆజాద్‌కు పర్మిషన్

బొంబే హైకోర్టుకు సంబంధించిన నాగ్‌పూర్‌ బెంచ్.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు స్పెషల్ పర్మిషన్ దక్కింది. రెషీమ్‌భాగ్ ప్రాంతంలోని ఆరెస్సెస్ స్మృతీ మందిర్ ఎదుటే ఆందోళన చేసుకునేందుకు సీపీ & బేరర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ప్రత్యేకమైన అనుమతులు వచ్చాయి. ముందుగా అప్లై చేసినప్పుడు పర్మిషన్‌ను స్థానిక కొట్వాలీ పోలీస్ స్టేషన్ కొట్టిపారేసింది. 

ఈ ప్రాంతంలో ఆందోళన చేసేందుకు అనుమతులు ఇస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు నిరాకరించినట్లు తెలిపారు. అనుమతి కోసం బొంబే హైకోర్టును ఆశ్రయించడంతో పర్మిషన్ దక్కింది. ఆరెస్సెస్ కార్యాలయానికి కిలోమీటర్ దూరంలో ధర్నా నిర్వహించనున్నారు. చీఫ్ మోహన్ భగవత్, జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషీలు స్మృతి మందిర్‌లో ఎప్పుడూ ఉంటారు. 

అన్నీ మెగా ఈవెంట్లను నాగ్‌పూర్ వేదికగానే ఆరెస్సెస్ చీఫ్  నిర్వహిస్తారు. సంఘ్ పరివార్.. విజయదశమి స్పీచ్ లు కూడా ఏటా ఇక్కడే జరుగుతాయి. భీమ్ ఆర్మీకి అనుమతులు ఇవ్వడానికి జస్టిస్ సునీల్ శుక్రే, మాధవ్ జాందర్ లు ఓ కండిషన్ పెట్టారు. ఇది ప్రజలకు ఆటంకం కలిగించకుండా, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఎటువంటి రాజకీయ ప్రయోజనాలకు లోను కాకుండా జరగాలని చెప్పారు. 

‘ఏ రకమైనా ఉద్వేగపూరిత స్పీచ్ లు అవకాశాలు లేవు. హింసను ప్రేరేపించే, పౌరుల్లో ద్వేషపూరిత మాటలు వచ్చినా, జాతికి సంబంధించి చెడ్డ మాటలు మాట్లాడినా.. నగర పౌరుల డిగ్నిటీ, రెప్యుటేషన్ దెబ్బతినేలా, జాతిని, చట్టాన్ని అవమానించేలా ఎటువంటి పనులు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు.