Chandrashekhar Azad : యూపీ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుకి సిద్ధం..భీమ్ ఆర్మీ చీఫ్

వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందని మంగళవారం భీమ్ ఆర్మీ మరియు ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.

Chandrashekhar Azad : యూపీ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుకి సిద్ధం..భీమ్ ఆర్మీ చీఫ్

Azad

Chandrashekhar Azad వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందని మంగళవారం భీమ్ ఆర్మీ మరియు ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకు తమ పార్టీ సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఓ ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ దయనీయమైన పరిస్థిలో ఉందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య పునరుద్దరణ కోసం తాము పోరాడతామని,ఇందులో భాగంగా జులై-1 నుంచి సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రజాసమస్యల ప్రాతిపదికగానే తమ పార్టీ యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని నిలువరించేందుకు ఓ పెద్ద కూటమి ఏర్పాటు చేయాలని తాను అనుకుంటున్నట్లు చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. యూపీ గురించి తాను ఆందోళన చెందుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీఎస్పీతో పొత్తుకి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

యూపీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు..యూపీలో బీజేపీని ఓడించగల పార్టీ లేదా కూటమికి ఆజాద్ సమాజ్ పార్టీ మద్దతిస్తుందని సమాధానమిచ్చారు. మరోవైపు,యూపీ ఎన్నికల్లో ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకునేది లేదని,ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని బీఎస్పీ చీఫ్ మాయావతి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.