కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. 8మంది మృతి.. శిథిలాల కింద 25మంది

  • Published By: vamsi ,Published On : September 21, 2020 / 08:36 AM IST
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. 8మంది మృతి.. శిథిలాల కింద 25మంది

మహారాష్ట్రలోని భివాండిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయి 8 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. రిలీఫ్, రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. ఈ భవనం 1984 సంవత్సరంలో నిర్మించగా.. 21 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం తక్షిణమే సహాయ చర్యలు చేపట్టగా.. 8నుంచి 10 మందిని శిథిలాల నుంచి బయటకు తీశారు. అందులో ఒక బిడ్డను రక్షించారు. సమాచారం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.


ముంబైకి ఆనుకొని ఉన్న థానేలోని భివాండిలో ఉన్న ఈ భవనానికి ప్రమాదకరమైన భవనం అని తొలగించాలంటూ ఇటీవలే మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు ఇచ్చింది. అర్థరాత్రి ఫ్లాట్లలో నివాసులు గాఢనిద్రలో ఉండగా.. మూడంతస్తుల భవనం సగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బీవండీ నగరంలోని 21 ఫ్లాట్లు ఉన్న జిలానీ అపార్టుమెంట్ ఇలా కుప్పకూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఫ్లాట్లలో ఉండేవారు గాఢ నిద్రలో ఉన్నారు. ఈ ఘటనలో 8 మంది చనిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు.



అయితే భవనం కూలిపోవడంతో స్థానికులు, అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి శిథిలాల కింద చిక్కుకుపోయిన 25 మందిని స్థానికులు రక్షించారు. మరో 20నుంచి 25 మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానికులు, అధికారులు సహాయ చర్యలు చేపట్టగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.