Neha Singh Rathore: భోజ్‌పురి గాయనికి షాకిచ్చిన యూపీ పోలీసులు.. పాటలో రాష్ట్రాన్ని విమర్శించారంటూ నోటీసులు

బిహార్‌కు చెందిన నేహా సింగ్ భోజ్‌పురి జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనేక ప్రైవేటు పాటల్ని సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కోవిడ్ సమయంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక పాట విడుదల చేసింది. దీనికి మంచి ఆదరణ దక్కింది. తర్వాత కూడా పలు ప్రైవేట్ సాంగ్స్ చేసింది.

Neha Singh Rathore: భోజ్‌పురి గాయనికి షాకిచ్చిన యూపీ పోలీసులు.. పాటలో రాష్ట్రాన్ని విమర్శించారంటూ నోటీసులు

Neha Singh Rathore: భోజ్‌పురి జానపద గాయని నేహా సింగ్ రాథోడ్‌కు ఉత్తర ప్రదేశ్ పోలీసులు షాకిచ్చారు. ఆమె ఇటీవల విడుదల చేసిన ఒక పాటలో ఉత్తర ప్రదేశ్‌పై విమర్శలు చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. బిహార్‌కు చెందిన నేహా సింగ్ భోజ్‌పురి జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Wipro: ఫ్రెషర్లకు సగం జీతాలు కట్ చేసిన విప్రో.. అన్యాయమంటున్న ఐటీ ఉద్యోగుల సంఘం

అనేక ప్రైవేటు పాటల్ని సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కోవిడ్ సమయంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక పాట విడుదల చేసింది. దీనికి మంచి ఆదరణ దక్కింది. తర్వాత కూడా పలు ప్రైవేట్ సాంగ్స్ చేసింది. యూపీ ఎన్నికల సమయంలో అక్కడి రాజకీయ పరిస్థితులపై ఒక పాట విడుదల చేసింది. యూపీ ఎన్నికల సదర్భంగా ‘యూపీ మే కా బా (యూపీలో ఏం ఉంది)’ అంటూ ఒక పాట విడుదల చేసింది. తర్వాత ‘గుజరాత్ మే కా బా(గుజరాత్‌లో ఏం ఉంది)’ పేరుతో మరో పాట విడుదల చేసింది.

Delhi Mayor: ఢిల్లీ మేయర్ పీఠం దక్కేది ఎవరికి? బుధవారమే మేయర్ ఎన్నికకు ముహూర్తం

ఈ పాటల్లో అక్కడి రాజకీయ పరిస్థితుల్ని విమర్శిస్తూ సాహిత్యం ఉంటుంది. ‘యూపీ మే కా బా’లో ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన లఖీంపూర్ ఖేరి హింస, హత్రాస్ అత్యాచార ఘటన వంటి వాటి గురించి నేహా సింగ్ తన పాటలో ప్రస్తావించింది. ఇటీవల పాటకు సీక్వెల్‌గా ‘యూపీ మే కా బా’ సీజన్-2ను యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఇందులోనూ యూపీలో జరిగిన కొన్ని అంశాల గరించి ప్రస్తావించింది. ఇటీవల బుల్డోజర్ కూల్చివేతలో భాగంగా ఒక తల్లీ కూతురు మరణించిన సంగతి తెలిసిందే. దీని గురించి కూడా పాటలో పేర్కొంది. అయితే, ఈ పాటలోని లిరిక్స్ యూపీని కించ పరిచేలా, విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంటూ పోలీసులు నేహా సింగ్‌కు నోటీసులిచ్చారు.

ANDHRA PRADESH: ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులు సెక్షన్ 160, సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. పలు ప్రశ్నలతో కూడిన నోటీసులిచ్చారు. వాటికి సమాధానాలివ్వాలని పేర్కొన్నారు. ఈ అంశంపై నేహా సింగ్ మాట్లాడింది. ‘‘నేను జానపద గాయనిని. నేను ప్రజల తరఫున మాట్లాడుతాను. యూపీని బీజేపీ పాలిస్తోంది. అందుకే నేను వాళ్లను ప్రశ్నిస్తాను. సమాజ్‌వాదీ పార్టీని ప్రశ్నించలేనుగా’’ అని ఆమె మాట్లాడారు.