Bhookha hi rahunga : ఆకలితోనే ఉంటా..ఏమీ వద్దు, బర్గర్ రాకపోవడంపై బుడ్డోడి రియాక్షన్, నెటిజన్లు ఫిదా

ఆకలితోనే ఉంటా..ఏమీ వద్దు..నువ్వే బర్గర్ ఆర్డర్ ఇచ్చుకో..నాకేమీ ఇవ్వకు..ఇలాగే ఉంటా...అంటూ ఓ బుడ్డోడు చెప్పిన మాటల వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ముద్దుముద్దు మాటలు నెటిజన్ల హృదయాలను తాకుతున్నాయి.

Bhookha hi rahunga : ఆకలితోనే ఉంటా..ఏమీ వద్దు, బర్గర్ రాకపోవడంపై బుడ్డోడి రియాక్షన్, నెటిజన్లు ఫిదా

Burger

Little Boy’s Reaction : ఆకలితోనే ఉంటా..ఏమీ వద్దు..నువ్వే బర్గర్ ఆర్డర్ ఇచ్చుకో..నాకేమీ ఇవ్వకు..ఇలాగే ఉంటా…అంటూ ఓ బుడ్డోడు చెప్పిన మాటల వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ముద్దుముద్దు మాటలు నెటిజన్ల హృదయాలను తాకుతున్నాయి. ఇష్టమైన ఫుడ్ ను తెప్పించుకుని..తమకు ఇప్పించకపోతే ఎలా ఉంటుంది ? కోపం తెప్పిస్తుంది కదా. తమకు కూడా తెప్పించాల్సి ఉండే..అనుకుంటుంటారు. ఇలాగే జరిగింది ఓ పిల్లాడికి. నీలం రంగు కుర్తా, పైజామా వేసుకున్న చిన్నోడు ఏదో కలతగా ఉన్నట్లు వీడియోలో కనిపించింది. నాతో మాట్లాడకండి..అంటున్నాడు.

Read More : Leopard Cub: చిరుత పిల్లలు అమ్ముతాం.. కావాలనుకునేవారు సంప్రదించాలంటూ ఫేస్‌బుక్ యాడ్

ఎందుకంటే..ఇంట్లో ఉన్న వారు బర్గర్ ఆర్డర్ చేశారు..కానీ అది తనకోసం కాదు అని తెలుసుకున్నాక..అలిగాడు. అతనిని ఆట పట్టించడానికి కుటుంబసభ్యురాలు ప్రయత్నించింది. నువ్వు ఆర్డర్ తెచ్చుకున్న బర్గర్ వెంటనే తినేయ్..నాకేమీ వద్దు..అంటూ ఒకింత కోపంతో చెప్పాడతను. బర్గర్ వైపు కూడా నేను చూడను అని ఖరాఖండిగా చెప్పాడు. నువ్వు చూస్తుంటే..నేను బర్గర్ తింటాను అని చెప్పగానే మరింత..కలత చెందాడు ఆ బాలుడు.

Read More : AP Corona Upadate : ఏపీలో కొత్తగా 2,252 కరోనా కేసులు.. 15 మంది మృతి

నా కోసం ఏమీ బర్గర్ ఆర్డర్ తేవొద్దు..అని చెప్పాడు. నీ దగ్గర పైసలు లేవు..నాన్న దగ్గర అడుగు..అని చెప్పగా..దీనికి బాలుడు మరింత రియాక్షన్ ఇచ్చాడు. నాతో అస్సలు మాట్లాడకు..నాకోసం ఆర్డర్ ఇవ్వకు..నేను ఏమీ తినను..ఇలాగే ఆకలితో ఉంటాననని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ బాలుడు. దీంతో ఆ కుటుంబసభ్యురాలు నవ్వేసింది. పాపం చిన్నోడు..అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.