wife cockroach Phobia : బొద్దింకలంటే చచ్చేంత భయపడుతున్న భార్య..విడాకులు కావాలంటున్న భర్త

భార్యకు బొద్దింకలంటే ఛచ్చేంత భయం..దీంతో మూడు సంవత్సరాలలో 18 ఇళ్లు మారారు. అయినా ఆమె సమస్య తీరలేదు. దీంతో విసిగిపోయిన ఆ భర్త విడాకులు కావాలంటున్నాడు.

wife cockroach Phobia : బొద్దింకలంటే చచ్చేంత భయపడుతున్న భార్య..విడాకులు కావాలంటున్న భర్త

Wife Cocroach Fear

wifes cockroach Phobia : బొద్దంకలు, బల్లులు అంటే చాలామంది ఆడవాళ్లు భయపడిపోతుంటారు. కొంతమందికి ఆ భయం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ బొద్దింకలంటే భయపడే ఓ మహిళ పాపం ఇళ్లిళ్లూ తిరుగుతోంది. బొద్దింక కనిపిస్తే చాలు ఏ అనకొండో..లేదా ఓ క్రూర మృగమో ఎదురుగా ఉన్నట్లుగా హడలిపోతుందా భార్య. పెద్ద పెద్దగా అరిచేస్తుంది. ఈ బొద్దింకల సమస్యతో ఆ భార్యాభర్తలు మూడు సంవత్సరాల్లో 18 ఇళ్లు మారారు. కానీ ఎక్కడికెళ్లినా బొద్దింకలు కనిపిస్తుండటంతో ఆమె భయానికి అంతు లేకుండా పోతోంది. బొద్దికలంటే ఇంతగా భయపడిపోతూ..ఇళ్లు మారటమే పనిగా మారటంతో ఆ భర్త ఇక ఈ భార్యతో నేను వేగలేను..నాకు విడాకులు కావాలి అనేంత వరకూ వెళ్లాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాపం ఆమెకు బొద్దింకలంటే ఎంత భయమో..!!

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ జంట(పేర్లు చెప్పటానికి ఇష్టపడలేదు)కు 2017లో వివాహం జరిగింది. భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పెళ్లైన కొన్ని రోజులకు భార్య వంటగదిలో పెద్ద పెద్దగా గా కేకలు పెట్టింది. దీంతో ఇంట్లో ఏదో పనిలో ఉన్న భర్త హడలిపోయాడు. పరుగు పరుగున వెళ్లి చూశాడు. ఏమిటా అని ఆరా తీస్తే.. ఓరి నాయనోయ్..బొద్దింక..బొద్దింక..బొద్దింక..అంటూ కళ్ళు పెద్దవి చేసి వణికిపోతూ కనిపించింది. నిలబడిన స్థలం నుంచి ఒక్క అడుగు కూడా కదలకుండా వణికిపోతూ నిలబడిపోయింది. బాబోయ్..వంటగదిలో బొద్దింకలున్నాయి..నేను ఛస్తే కిచెన్ లోకి వెళ్లనని తేల్చి చెప్పేసింది. వేరే ఇల్లు మారదామని పట్టుబట్టింది.

అలా మరో ఇంటికి మారారు. అక్కడ కూడా ఇదే సమస్య. మళ్లీ ఇంకో ఇంటికి మారారు. అక్కడ కూడా అదే సమస్య రిపీట్ కావటంతో మరోఇల్లు. ఇలా కేవలం మూడు సంవత్సరాలలో 18 ఇళ్లు మారే వరకు కొనసాగింది…ఆ భార్య బొద్దింకల భయం..దీంతో అతని ఆఫీసులో కొలీగ్స్ ‘ఏంటిరా మళ్లీ ఇల్లు మారావా? ఇప్పుడెక్కడికి మారావు? అనీ..సామాన్యలన్నీ మారిన ఇంటిలో సర్ధుకోకండీ..మళ్లీ నీ పెళ్లాం ఇల్లు మారదామనే కచ్చితంగా అంటుంది..ఎందుకు టైమ్ వేస్టు సామాన్లు సర్ధుకోవద్దు’ అని కొంతమంది అంటే ఇంకొందరు..సామాన్లు సర్ధుకోవటమే కాదు..అసలు సామాన్లు షిప్టు చేసే వాహనంలోంచే సామాన్లు దించొద్దు’’అంటూ ఆటపట్టిస్తున్నారు. దీంతో అతనికి భార్య భయంపై అసహనం పెరిగిపోయింది.

దీంతో భార్య ప్రవర్తనపై ఆ భర్తకు అసహనం పెరిగిపోయింది. వెంటనే సైకాలజిస్టుల దగ్గరకు తీసుకెళ్లాడు. కౌన్సెలింగ్ ఇప్పించాడు. కానీ అదే సమస్య మళ్లీ మళ్లీ రావటంతో మరో సైకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లాడు. దీంతో ఆ భార్య భర్తపై మండిపడింది. ‘‘ఏంటీ నేనేమన్నా పిచ్చిదాన్ననుకుంటున్నావా?’’అంటూ ప్రశ్నించింది. ఆవేదన చెందింది. దీంతో ఆ భర్తకు ఏం చేయాలో పాలుపోలేదు. ఎంతగా చెప్పినా…ఎంతమందితో చెప్పించినా…భార్యకు బొద్దింకల భయం పోవటంలేదు. దీంతో విసిగిపోయిన భర్త చేసేది లేక ‘‘ఈ బొద్దింకల భయం భార్యతో నేనిక వేగలేను..నా విడాకులు కావాలంటున్నాడు. బొద్దింకలంటే నా భార్యకు ఎంత భయమంటే.. గట్టిగా అరుస్తూ ఇంట్లో సామాన్లను బయటకు విసిరేస్తోంది. ఇక నాకు ఆమెను భరించే ఓపిక లేదు. అందుకే విడాకులకు అప్లై చేశానని చెబుతున్నాడు.