Bhopal Vendor : మురుగునీటిలో కొత్తిమీర కట్టలు కడిగిన వ్యాపారి…కలెక్టర్ సీరియస్

ఓ వ్యాపారి కొత్తిమీర కట్టలను మురికినీటిలో కడిగిన ఘటనపై భోపాల్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

Bhopal Vendor : మురుగునీటిలో కొత్తిమీర కట్టలు కడిగిన వ్యాపారి…కలెక్టర్ సీరియస్

Bhopal

Washing Coriander Leaves In Drain Water : ఆకు కూరలు, పౌష్టికాహారమైన కూరగాయలు తినాలని వైద్యులు, నిపుణులు చెబుతుంటారు. కానీ..వ్యాపారం నిర్వహించే కొంతమంది కక్కుర్తికి ఆశపడి…పాడు పనులు చేస్తుంటారు. కల్తీలు చేయడంలాంటి పనులకు పాల్పడుతుంటారు. ఆరోగ్యానికి ఎంతో దోహదపడే..ఆకుకూరల విషయంలో ఇలాగే చేస్తుంటారు. ఓ వ్యాపారి కొత్తిమీర కట్టలను మురికినీటిలో కడిగిన ఘటనపై భోపాల్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కూరగాయల విక్రేతపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More : T20 World Cup 2021: న్యూజిలాండ్‌కు మరో షాక్.. టీమిండియాతో మ్యాచ్‌కు ముందే

భోపాల్ లోని ఓ ప్రాంతంలో కూరగాయలు విక్రయించే ఓ వ్యాపారి పక్కనే ఉన్న డ్రైనేజీ నీటిలో కొత్తిమీర కట్టలను కడగడం ఓ వ్యక్తి కంటపడింది. వెంటనే దానిని వీడియో తీశాడు. వీడియో తీస్తున్నా..ఆ యువ వ్యాపారి భయపడలేదు. ముసిముసి నవ్వులు నవ్వుతూ..వీడియో తీయవద్దని..తన దగ్గర ఎవరూ కొనరని వీడియోలో చెప్పడం వినిపించింది. sudhirdandotiya అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేశారు. అందులో భోపాల్ కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులకు హ్యాష్ ట్యాగ్ చేశారు. దీంతో ఆ వీడియో భోపాల్ కలెక్టర్ Avinash Lavania దృష్టికి చేరింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…వెంటనే చర్యలు తీసుకోవాలంటూ..ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను పోస్టు చేస్తూ..పలువురు ఉన్నతాధికారులకు హ్యాష్ ట్యాగ్ చేశారు. అతడిని గుర్తించాలని పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్, ఫుడ్ సంబంధించిన శాఖను ఆదేశించారు.

Read More : India on China Law : మనకు ఆందోళనకరమే..చైనా భూ సరిహద్దు చట్టంపై స్పందించిన భారత్

వెంటనే అధికారులు అలర్ట్ అయి అతడు ఎవరో గుర్తించే పనిలో పడ్డారు. మంగళవారం వ్యాపారిని గుర్తించామని, ఫోన్ నెంబర్ గుర్తించగా..ఫోన్ స్విచాఫ్ చేయబడిందని పోలీసులు తెలిపారు. హనుమాన్ గంజ్ లో ఫుడ్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. వీడియోలో ఉన్న వ్యక్తి ధర్మేంద్రగా గుర్తించామని, నవ్ బహార్ కూరగాయాల మార్కెట్ లో కూరగాయాలు విక్రయించినట్లు హనుమాన్ గంజ్ పీఎస్ SHO Mahendra Singh Thakur వెల్లడించారు.

Read More : ICC T20 : ప్రమాదం నుంచి తప్పించుకున్న అంపైర్..వీడియో వైరల్

అతని ఇంటి అడ్రస్ కనుక్కొన్నామని, కానీ అతను అక్కడ లేడని..త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. నగర పౌరులకు ముప్పు కలిగించే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడినా..జాతీయ భద్రతా చట్టంలోని నిబంధనల ప్రకారం..చర్యలు తీసుకొనడం జరుగుతుందని సబ్ డివిజన్ మేజిస్ట్రేట్లు కూడా చర్యలు తీసుకోవాలని భోపాల్ కలెక్టర్ Avinash Lavania ఆదేశించారు.