ప్రియురాలిని పెళ్లి చేసుకోమన్న భార్య..ఇద్దరి ప్రేమ కావాలంటున్న భర్త

  • Published By: nagamani ,Published On : November 9, 2020 / 05:09 PM IST
ప్రియురాలిని పెళ్లి చేసుకోమన్న భార్య..ఇద్దరి ప్రేమ కావాలంటున్న భర్త

Bhopal : భర్త తాగుబోతైనా..జూదరి అయిన భార్య భరిస్తుంది. కానీ వేరే స్త్రీతో సంబంధం ఉందని తెలిస్తే ఊరుకోదు..భరించలేదు. కానీ ఓ భార్య మాత్రం అపర పతివ్రతా శిరోమణిలాగా భర్త ప్రేమించిన అమ్మాయితో ఉండటానికి తన జీవితాన్నే జీవితం త్యాగంచేసింది. భర్తకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఆమె భర్తకు విడాకులిచ్చింది. ‘‘నీ సుఖమే నే కోరుకున్నా..నిను వీడి అందుకే వెళుతున్నా’’నంటూ విడాకులిచ్చేసింది. కానీ ఆ భర్త మాత్రం నాకు నా భార్య అంటే కూడా చాలా ఇష్టం ఆమె కావాలి..ప్రేమించిన అమ్మాయి కూడా కావాలంటున్నాడు. ఈ విచిత్ర బంధాల సీరియల్ లాంటి ఘటనలు మధ్యప్రదేశ్ భోపాల్ లో జరిగింది.


వివరాల్లోకి వెళితే..భూపాల్ లో ఓ వ్యక్తికి వివాహం జరిగి మూడేళ్లైంది. ఈక్రమంలో అతనికి వేరే యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ విషయం భార్యకు తెలిసింది. చిత్రంగా ఆమె భర్తను ఒక్క మాటకూడా అనలేదు. పైపెచ్చు..నీకు ఆమెతో ఉంటేనే సంతోషంగా ఉంటే ఆమెనే పెళ్లి చేసుకో..నీకు నేను విడాకులిస్తాను..ఆమెను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండి అని చెప్పింది. కానీ ఆ భర్త మాత్రం నాకు మీరిద్దరూ సమానమే..మీ ఇద్దరీ ప్రేమా కావాలంటున్నాడు. ఒకరి కోసం మరొకరిని వదులుకోలేనంటున్నాడు. ఇద్దరితో కలిసి ఉండాలన్న నిర్ణయానికి వచ్చాడు. కానీ అది అయ్యేపనికాదు. చట్టం కూడా ఒప్పుకోదు.


పాపం తన భర్త ఇలా భార్య కావాలా, లవర్ కావాలో తేల్చుకోలేక పరిస్థితుల్లో తల్లడిల్లిపోవటం చూసిన ఆ భార్య ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. భర్తకు విడాకులు ఇచ్చి..భర్త ప్రేమికురాలిని పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


దీనిపై ఆ భార్య తరపు లాయర్ మాట్లాడుతూ.. నా క్లైంట్ తన భర్త కోసం అతని గర్ల్ ఫ్రెండ్ కలిసి ఉండటానికి చాలా త్యాగం చేసింది. అలా ఎవ్వరూ చేయరు. అతను మాత్రం ఇద్దరితో కలిసి వివాహ సంబంధంలో ఉండాలని అనుకున్నాడు. కానీ అది సాధ్యం కాదు. అతని భార్య చాలా పరిణితితో ఆలోచించటంతో ఈ సమస్య చాలా తేలిగ్గా విడిపోయింది. అదే ఆమె గొడవచేస్తూ ముగ్గురి జీవితాలు నాశమయ్యేవన్నాడు. భర్త ఆనందం కోసం ఆమె అతడికి విడాకులు ఇచ్చి గర్ల్ ఫ్రెండ్ తో వివాహానికి సహకరించింది’ అని అన్నారు.


మూడేళ్లు కాపురం చేసిన తర్వాత కూడా వేరే మహిళతో సంబంధం కోరుకున్న వ్యక్తికి విడాకులు ఇవ్వడం ఆమె పెద్ద మనస్సుకు నిదర్శనమని అన్నారు. నా క్లైంట్ తీసుకున్న నిర్ణయం ఔదార్యం చాలా గొప్పదని.. ఆమె తరపు మహిళా లాయర్ తెలిపింది. ఆమె ధైర్యాన్ని నెటిజన్లు సమస్కరిస్తున్నారు.


కాగా గతంలో భోపాల్ లోని కోలార్ ప్రాంతంలో 2019లో ఇటువంటిదే జరిగింది. కానీ ఈ కేసులో భర్తే భార్యకు విడాకులిచ్చాడు. పెళ్లి అయి ఏడు సంవత్సరాలు అయిన భార్య తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి భర్త భార్యకు విడాకులిచ్చాడు.




తనతో వివాహం జరగటానికి ముందే తన భార్య వేరే యువకుడిని ప్రేమించిందని తెలుసుకుని ఆ యువకుడితో తన భార్యకు పెళ్లి చేయటానికి ఆ భర్త భార్యకు విడాకులిచ్చాడు. అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయినా సరే జీవితంలో రాజీ పడి జీవితాలను నరకం చేసుకునే కంటే విడిపోయి ఎవరికి వారు సంతోషంగా బతకాలనే ఉద్ధేశంతో ఇలా ఆ భార్యభర్తలిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు.